PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
PM Modi | బంగారు కొనద్దని, విదేశాలకు వెళ్లొద్దని, పెట్రోల్, డీజిల్ ఫర్టిలైజర్స్, వంటనూనె తక్కువగా వినియోగించాలని ప్రజలకు చెప్పడం ప్రధాని మోదీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల పాలనలో ఆయన దేశాన్ని ఏ స్థితికి తీసుకువచ్చారంటే.. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.
PM Modi | మధ్యప్రాచ్య సంక్షోభం (Middle East crisis) నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునివ్వడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మోదీ సూచనలు ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమంటూ ధ్వజమెత్తుతున్నాయి. ప్రధాని సూచనలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
"నిన్న మోదీ జీ కొన్ని త్యాగాలు చేయాలంటూ ప్రజలను కోరారు. బంగారం కొనకండి, విదేశాలకు వెళ్లకండి, పెట్రోల్ వినియోగాన్ని తగ్గించండి. ఎరువులు, వంట నూనె వాడకాన్ని తగ్గించాలని, మెట్రోలో ప్రయాణించాలని, వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ మీటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవి కేవలం సూచనలు కావు.. ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనం" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ 'కాంప్రమైజ్డ్ ప్రధాని' వల్ల సాధ్యం కాదు..
12 ఏళ్ల పాలనలో ఆయన దేశాన్ని ఏ స్థితికి తీసుకువచ్చారంటే.. ప్రజలు ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ప్రతిసారీ వైఫల్యాల బాధ్యతను ప్రజలపైకి నెట్టి, ప్రభుత్వం జవాబుదారీతనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. దేశాన్ని నడపడం ఇక ఈ 'కాంప్రమైజ్డ్ ప్రధాని' వల్ల సాధ్యం కాదు అంటూ రాహుల్ తన ట్వీట్‌లో ఘాటుగా విమర్శించారు.
వాస్తవ పరిస్థితులను తెలియజేయండి..
మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ విజ్ఞప్తిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. దేశంలో ఇంధన భద్రతను నిర్ధారించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించింది. ప్రధాని నుంచి ఇలాంటి తీవ్రమైన ఆదేశాలు రావడానికి గల కారణాలను ఆ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం ప్రశ్నించారు. ప్రతిపక్షాలకు, దేశ ప్రజలకు వాస్తవ పరిస్థితిని తెలియజేయడానికి తక్షణమే పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది చాలా సిగ్గుచేటు..
అదే సమయంలో.. ఇంధన ప్రయోజనాలను కాపాడటంలో మోదీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ప్రపంచ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూడడం పోయి.. ప్రధాని మోదీ సామాన్య పౌరులను ఇబ్బందులకు గురిచేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సన్నద్ధత కంటే ఎన్నికలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని ఆయన ఆరోపించారు.
ప్రజలకు ప్రధాని పొదుపు సూచనలు ఇవే..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పౌరులు కొన్ని త్యాగాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గడ్డు కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని మనం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, వంటనూనెల్లో స్వయం సంవృద్ధి సాధించాలన్నారు. ఎరువుల వినియోగం తగ్గించి భూసారాన్ని కాపాడాలన్నారు.
ప్రజలు సొంత వాహనాలకు బదులుగా మెట్రోలు, బస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ మీటింగ్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దుబారా ఖర్చులు తగ్గించాలని, ఆడంబరాలకు పోడకూడదన్నారు. ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు చేయొద్దని పిలుపునిచ్చారు. బంగారం దిగమతులు తగ్గిస్తే విదేశీమారక ద్రవ్యం పెరుగుతుందన్నారు.
Also Read..
నరసింహ ముఖంతో దర్శనమిచ్చే ఆంజనేయుడు.. కొండగట్టు క్షేత్ర విశిష్టత ఇదే..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ మొదలైన యుద్ధం ఎఫెక్ట్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?
- ●Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!
- ●Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి
- ●Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..
- ●Grace Antony | వాటే ట్రాన్స్ఫర్మేషన్ - బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన మలయాళ బ్యూటీ!
- ●Singireddy Niranjan Reddy | ధృతరాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోసలు కనిపించడం లేదు: నిరంజన్‌రెడ్డి

Movie Collections | నాగబంధం వర్సెస్ రావు బహదూర్ - ఈ వారం రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ దేనికి వచ్చాయంటే?

Telangana SIR Process Status | తెలంగాణలో జోరుగా SIR ప్రక్రియ: పంపిణీలో టాప్.. డిజిటైజేషన్లో ఢమాల్, జిల్లాల వారీగా రిపోర్ట్ ఇదే!

Jalalabad Renamed Parshurampuri | జలాలాబాద్ ఇక నుంచి పరశురాంపురి

Cult.fit IPO | పెట్టుబడిడారులకు అలర్ట్.. రూ.4వేల కోట్ల ఐపీఓకు కల్ట్.ఫిట్ సిద్ధం..






