HDFC | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు
HDFC | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచింది. రూ.3 కోట్లలోపు డిపాజిట్లపై ఎంపిక చేసిన కాలపరిమితులకు గరిష్టంగా 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) వరకు పెంపు చేపట్టింది. సవరించిన రేట్లు నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి.
HDFC | దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచింది. రూ.3 కోట్లలోపు డిపాజిట్లపై ఎంపిక చేసిన కాలపరిమితులకు గరిష్టంగా 0.50 శాతం (50 బేసిస్ పాయింట్లు) వరకు పెంపు చేపట్టింది. సవరించిన రేట్లు నవంబర్ 4 నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా సవరణతో సాధారణ ఖాతాదారులకు గరిష్టంగా 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ లభించనుంది. 61 రోజుల నుంచి ఆరు నెలల లోపు డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు వడ్డీని 4.25 శాతం నుంచి 4.75 శాతానికి పెంచింది. ఆరు నెలల ఒక రోజు నుంచి తొమ్మిది నెలల వరకు 5.65 శాతానికి, తొమ్మిది నెలల ఒక రోజు నుంచి ఏడాదిలోపు డిపాజిట్లపై 5.90 శాతానికి పెంచింది.
18 నెలల ఒక రోజు నుంచి రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.50 శాతం, రెండేళ్ల ఒక రోజు నుంచి మూడేళ్ల వరకు 6.55 శాతం వడ్డీ అందించనుంది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల వరకు, ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై గరిష్టంగా 6.60 శాతం వడ్డీ చెల్లించనుంది. సీనియర్ సిటిజన్లకు 61 రోజుల నుంచి ఆరు నెలల డిపాజిట్లపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల ఒక రోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై అత్యధికంగా 7.20 శాతం అందిస్తోంది. ఐదేళ్ల ఒక రోజు నుంచి పదేళ్ల వరకు డిపాజిట్లపై వడ్డీని 6.65 శాతం నుంచి 7.10 శాతానికి పెంచింది. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు కూడా ఎంపిక చేసిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను సవరించాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!
- ●Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!
- ●CM Revanth Reddy | కొడంగల్లో పారిశ్రామిక హబ్.. 535 మందికి ఉద్యోగాలు
- ●PJTAU | బీఎస్సీ అగ్రికల్చర్లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈనెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు..
- ●Surekha Vani | డిలీట్ చేయండి లేదంటే లీగల్ యాక్షన్ - సురేఖా వాణి వార్నింగ్
- ●RTC Lands | హౌసింగ్ బోర్డుకు ముషీరాబాద్ ఆర్టీసీ భూములు.. జీవో జారీ చేసిన సర్కారు..

Diwali | అయోధ్యలో దీపోత్సవం.. 30 లక్షల దీపకాంతుల్లో వెలిగిపోయిన రామనగిరి..!

Diwali 2026 | ఇంట్లో లక్ష్మీగణేశుల పూజ ఎలా చేయాలి? పూర్తి విధానం, మంత్రాలు ఇవే!

CM Revanth Reddy | కొడంగల్లో పారిశ్రామిక హబ్.. 535 మందికి ఉద్యోగాలు

PJTAU | బీఎస్సీ అగ్రికల్చర్లో 60 స్పాన్సర్డ్ సీట్లు.. ఈనెల 8 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు..



