త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Flight Fares | దీపావళి ఎఫెక్ట్‌.. విమాన టికెట్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. హైద‌రాబాద్‌-ల‌క్నోకు రూ.18వేలు..!

Flight Fares | దీపావళి పండుగ వేళ విమాన ప్రయాణికులకు టికెట్‌ ధరలు షాకిస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా లక్నోకు వెళ్లే విమానాల టికెట్‌ ధరలు సాధారణ రోజులతో పోలిస్తే ఐదు రెట్లకు పైగా చేరాయి.

P

Business | Published On Nov 7, 2026, 9.45 pm IST

Flight Fares | దీపావళి ఎఫెక్ట్‌.. విమాన టికెట్ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు.. హైద‌రాబాద్‌-ల‌క్నోకు రూ.18వేలు..!
Advertisement

Flight Fares | దీపావళి పండుగ వేళ విమాన ప్రయాణికులకు టికెట్‌ ధరలు షాకిస్తున్నాయి. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా లక్నోకు వెళ్లే విమానాల టికెట్‌ ధరలు సాధారణ రోజులతో పోలిస్తే ఐదు రెట్లకు పైగా చేరాయి. హైదరాబాద్‌ నుంచి లక్నోకు వెళ్లే విమాన టికెట్‌ ధర కూడా గరిష్టంగా రూ.18,467కు చేరింది.

హైదరాబాద్‌ నుంచి రూ.18 వేలకుపైగా..

హైదరాబాద్‌ నుంచి లక్నోకు వెళ్లే ఇండిగో విమానం (సాయంత్రం 6.45 గంటలు) టికెట్‌ ధర రూ.12,099గా ఉంది. ఎయిరిండియా రాత్రి 10.30 గంటల విమానానికి రూ.14,162, ఉదయం 8.30 గంటల విమానానికి రూ.18,467గా టికెట్‌ ధర పలుకుతోంది. ముంబై నుంచి లక్నోకు వెళ్లే విమాన టికెట్ల ధరలు మరింత అధికంగా ఉన్నాయి. ఆకాసా ఎయిర్‌ మధ్యాహ్నం 12.05 గంటల విమానానికి రూ.27,462గా ధర ఉంది. ఇండిగో విమాన టికెట్లు రూ.16,666 నుంచి రూ.24,068 వరకు పలుకుతున్నాయి. ఎయిరిండియా విమాన టికెట్‌ ధర రూ.23,537కు చేరింది. సాధారణ రోజుల్లో ఇదే ప్రయాణానికి రూ.5 వేల నుంచి రూ.5,500 వరకు మాత్రమే ఖర్చవుతుంది.

ఢిల్లీ నుంచి రూ.14 వేల వరకు..

ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లే ఎయిరిండియా విమాన టికెట్‌ ధర రూ.14,113కు చేరింది. ఇండిగో విమానానికి రూ.10,950, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ.8,955గా ఉంది. బెంగళూరు నుంచి లక్నోకు విమాన టికెట్లు రూ.12,450 నుంచి రూ.17,093 వరకు ఉండగా.. పుణె నుంచి వెళ్లే విమానాలకు రూ.9,961 నుంచి రూ.12,436 వరకు ధరలు పలుకుతున్నాయి. పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు విమాన టికెట్ల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

Advertisement
Advertisement