Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
Vijay-Sangeeta | తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్-సంగీత (Vijay-Sangeeta)విడాకుల కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విడాకుల పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకున్నారు (Sangeetha withdraws divorce petition).
Vijay-Sangeeta | త్రినేత్ర.న్యూస్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్-సంగీత (Vijay-Sangeeta)విడాకుల కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విడాకుల పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకున్నారు (Sangeetha withdraws divorce petition). విడాకుల కేసు ఇవాళ విచారణకు రాగా.. సంగీత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యాయస్థానం ముందు హాజరయ్యారు. తాను ఈ కేసును ఉపసంహరించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆమె విజ్ఞప్తి మేరకు చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు ఈ కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. విజయ్ సీఎం అయిన తర్వాత భార్యతో మళ్లీ కలుస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారం వేళ తాజా పరిణామం చోటు చేసుకుంది. సంగీత తీసుకున్న నిర్ణయం పట్ల ఇరు కుటుంబ సభ్యులతోపాటూ, విజయ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విడాకులు కావాలని పిటిషన్
విజయ్ (Thalapathy Vijay), సంగీత (Sangeeta) విడాకుల వ్యవహారం దక్షిణాది సినీ పరిశ్రమతోపాటూ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 26 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న సంగీత.. విడాకుల కోసం చెన్నైలోని చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా తన భర్త విజయ్‌పై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. మరో నటితో విజయ్ వివాహేతర సంబంధం పెట్టుకొని తనను మానసికంగా వేదనకు గురిచేశాడని ఆరోపించింది. ఆమెతో బంధాన్ని తెచ్చుకుంటానని మాటిచ్చిన విజయ్.. దానిని నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ హీరోయిన్‌తో కలిసి విదేశాలకు విహారయాత్రకు కూడా వెళ్లాడని సంగీత తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏడాది కాలంగా చాలానే ప్రయత్నాలు చేశానని, అవేవీ ఫలించలేదని సంగీత పిటిషన్‌లో పేర్కొంది. మరో మార్గం లేకే విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.
సీఎం అయ్యాక మారిన సీన్
ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో విజయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం అయిన తర్వాత విజయ్ వ్యక్తిగత జీవితంపై కూడా దృష్టి పెట్టినట్లు తమిళనాట ప్రచారం జరిగింది. భార్య సంగీతతో మళ్లీ కలిసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. విడాకుల విషయంలో రాజీ పడాలని విజయ్, సంగీత నిర్ణయించుకున్నట్లు గత కొద్ది రోజులుగా తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయభేదాలను పరిష్కరించే దిశగా సంగీత తరఫు కుటుంబసభ్యులతో పాటు అటు విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సంగీతను విజయ్ తల్లి శోభా స్వయంగా కలిసి మాట్లాడారని కూడా టాక్ నడిచింది. అదే సమయంలో త్రిషతో విజయ్‌కి బ్రేకప్ అయినట్లుగా కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాల వేళ విడాకుల పిటిషన్‌ను సంగీత వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
Also Read..
ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
ఒక్క సినిమా 830 కోట్ల రెమ్యూనరేషన్ - అవెంజర్స్ డూమ్స్‌డేతో ఐరన్ మ్యాన్ రికార్డ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Supreme Court | కావేరి జలాల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సెప్టెంబర్ 22, 2026

Tamil Nadu | తమిళనాడు సర్కార్ బంపర్ ఆఫర్.. ప్రతి ఇంటికీ రూ.22వేల వరకు సోలార్ పథకం సబ్సిడీ..
సెప్టెంబర్ 22, 2026

Prakash Raj | విజయ్ విషయంలో నాకు చాలా సందేహాలు ఉన్నాయి.. టీవీకే పాలనపై ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్
- ●Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..
- ●Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి
- ●IIT Bombay | ఐఐటీ బాంబే హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగింపు.. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో యాజమాన్యం కీలక నిర్ణయం
- ●iPhone 18 Pro Snatching | 'ఇది కొత్త ఐఫోనా?' అని అడిగి.. ఆటోలో వెళ్తున్న యువతి చేతిలో నుంచి ఐఫోన్ 18 ప్రో లాక్కెళ్లిన దొంగలు

High-Rise Apartment Struggles | "పక్షులు కూడా మనుషులను వింతగా చూస్తాయి!" - 20వ అంతస్తులో నివసించే వారి విచిత్ర కష్టాలపై వీడియో వైరల్

Personal Loan | ఒకేసారి ఎన్ని వ్యక్తిగత రుణాలు తీసుకోవచ్చు? ఇలా చేస్తే ఆర్థిక భారం తప్పదు..

Traffic Restrictions | గణేశ్ నిమజ్జనం.. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఆంక్షలు

Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం వద్ద తీవ్ర ఉద్రిక్తత.. తోపులాటలో వినయ్ భాస్కర్ కంటతడి



