Avengers | ఒక్క సినిమా … 830 కోట్ల రెమ్యూనరేషన్ – అవెంజర్స్ డూమ్స్‌డేతో ఐరన్ మ్యాన్ రికార్డ్
అవెంజర్స్ ఫ్రాంచైజ్‌కు కొనసాగింపుగా అవెంజర్స్ డూమ్స్ డే మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం రాబర్ట్ డౌనీ జూనియర్ 830 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. అవెంజర్స్ గత సినిమాల్లో ఐరన్ మ్యాన్‌గా సూపర్ హీరో పాత్రలో కనిపించిన రాబర్ట్ డౌనీ అవెంజర్స్ డూమ్స్ డేలో మాత్రం విలన్‌గా నటిస్తోన్నాడు.
Entertainment | Published On Aug 7, 2026, 4.12 pm IST
Avengers | ఒకప్పుడు ఓ సినిమాకు యాభై కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటేనే గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఇప్పుడు వందల కోట్లు కామన్‌గా మారిపోయాయి. మహేష్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు వంద కోట్లకుపైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. పుష్ప, పుష్ప 2 సినిమాలకుగాను అల్లు అర్జున్ మూడు వందల కోట్ల పారితోషికం అందుకోవడం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది.
ఐరన్ మ్యాన్....
కానీ ఓ హాలీవుడ్ హీరో మాత్రం ఒక్క సినిమాకే 830 కోట్ల రెమ్యూనరేషన్ అందుకొని చరిత్రను సృష్టించాడు. వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఓ సినిమా కోసం అత్యధిక పారితోషికం స్వీకరించిన హీరోగా నిలిచాడు. ఆ హీరో మరెవరో కాదు. రాబర్ట్ డౌనీ జూనియర్. అవెంజర్స్ సినిమాల్లో ఐరన్ మ్యాన్ పాత్రతో ఫేమస్ అయ్యాడు రాబర్ట్ డౌనీ జూనియర్. అవెంజర్స్ ఫ్రాంచైజ్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు రాగా అన్నింటిలో ఐరన్ మ్యాన్ పాత్ర ఎక్కువగా హైలైట్ అయ్యింది.
డూమ్స్ డే....
అవెంజర్స్ ఫ్రాంచైజ్‌కు కొనసాగింపుగా అవెంజర్స్ డూమ్స్ డే సినిమా రాబోతుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ మార్వెల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇన్నాళ్లు అవెంజర్స్ సినిమాల్లో హీరోగా కనిపించిన రాబర్ట్ డౌనీ జూనియర్ డూమ్స్ డేలో మాత్రం విలన్‌గా కనిపించబోతున్నాడు. డాక్టర్ డూమ్ అనే పాత్ర చేస్తున్నాడు.
రెమ్యూనరేషన్...
ఈ సినిమా కోసం రాబర్ట్ డౌనీ జూనియర్ 100 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. ఇండియన్ కరెన్సీలో 830 కోట్లకుపైనే అతడికి ఈ సినిమాతో దక్కింది. అవెంజర్స్ డూమ్స్ డేతో హాలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా రాబర్ట్ డౌనీ జూనియర్ రికార్డ్ నెలకొల్పాడు.
రూసో బ్రదర్స్...
మూడు గ్రహాలు ఒకదానినొకటి ఢీకొని సృష్టి అంతమయ్యే పరిస్థితి వస్తుంది. అవెంజర్స్‌తో పాటు ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్ కలిసి ఈ ప్రమాదం నుంచి భూమిని ఎలా కాపాడారు అనే కథతో అవెంజర్స్ డూమ్స్ డే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా రూసో బ్రదర్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు క్రిస్ హెమ్స్‌వర్త్, క్రిస్ ఎవాన్స్, ఆంథోనీ మాకీ, పెడ్రో పాస్కల్‌తో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
తాజావార్తలు
- ●రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!
- ●Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ
- ●Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత
- ●EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..
- ●Komatireddy | కాంట్రాక్టర్లను వేధించొద్దు.. గనులశాఖ అధికారులకు కోమటిరెడ్డి ఆదేశాలు
- ●Harish Rao | ‘మిషన్ భగీరథ’ అనేది పథకం కాదు.. ప్రజల జీవితాలను మార్చిన మహత్తర ప్రణాళిక

రీచార్జ్ నుంచి ATM ఛార్జీల దాకా.. మధ్యతరగతి జేబుకు చిల్లులు పెడుతున్న ‘డిజిటల్ దోపిడీ’!

Harish Rao | తెలంగాణ నీటి హక్కులను రక్షించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి హరీశ్‌రావు లేఖ

Vijay-Sangeeta | సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక ట్విస్ట్.. పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత

EV Charging Station | ఈవీ చార్జింగ్ స్టేషన్లకు భారీగా డిమాండ్.. స్వయం ఉపాధితో చక్కని ఆదాయం..



