Salman Khan | రూ.3 కోట్ల మోసం కేసు.. సల్మాన్ ఖాన్‌కు కోర్టు సమన్లు
Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) చిక్కుల్లో పడ్డారు. రూ.3 కోట్ల మోసం కేసులో సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి (Alvira Khan Agnihotri)కి చండీగఢ్ జిల్లా కోర్టు (Chandigarh court) సమన్లు జారీ చేసింది.
Salman Khan | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) చిక్కుల్లో పడ్డారు. రూ.3 కోట్ల మోసం కేసులో సల్మాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రి (Alvira Khan Agnihotri)కి చండీగఢ్ జిల్లా కోర్టు (Chandigarh court) సమన్లు జారీ చేసింది. చండీగఢ్‌లోని మణిమజ్రా (Manimajra)లో ఉన్న ‘బీయింగ్ హ్యూమన్’ (Being Human) జ్యువెలరీ షోరూమ్‌కు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ సమన్లు పంపింది. అక్టోబర్ 5వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ గుప్తా (businessman Arun Gupta) ఈ ఫిర్యాదు చేశారు. వ్యాపార అవకాశాలు ఉన్నాయంటూ తప్పుడు హామీలిచ్చి తనను షోరూమ్‌లో పెట్టుబడులు పెట్టేలా చేసి మోసం చేశారని ఆరోపించారు. వారి మాటలు నమ్మి బీయింగ్ హ్యూమన్ షోరూమ్‌లో పెట్టుబడులు పెట్టానని తెలిపారు. దీనివల్ల తాను కోట్లాది రూపాయలు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. షోరూమ్ ఏర్పాటుకే దాదాపు రూ.కోటి ఖర్చు చేసినట్లు చెప్పారు. ఒప్పందం ప్రకారం తాను చేయాల్సిందంతా చేసినట్లు వివరించారు.
అయితే, షోరూమ్ ప్రారంభమైన తర్వాత కంపెనీ తనకు ఎలాంటి వ్యాపార సహకారం అందించలేదని ఆరోపించారు. దీనివల్ల భారీ ఆర్థిక నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీయింగ్ హ్యూమన్ జ్యువెలరినీ సరఫరా చేయాల్సిన అవుట్‌లెట్ 2020 ఫిబ్రవరి నుంచి మూతపడిందని తెలిపారు. దీనివల్ల స్టాక్ నిలిచిపోయి వ్యాపారం తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
అయితే, అరుణ్ గుప్తా ఆరోపణలను కంపెనీ గతంలోనే ఖండించింది. చండీగఢ్ వ్యాపారవేత్తతో 2018లో కుదిరిన ఒప్పందంతో సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. బ్రాండ్ లైసెన్సింగ్ ఏర్పాటు కింద జ్యువెలరీ వ్యాపారాన్ని 'స్టైల్ అండ్ కంటెంట్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్' మాత్రమే స్వతంత్రంగా నిర్వహిస్తోందని పేర్కొంది.
Also Read..
ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ.. సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్
ప్రయాణికుల ఫ్లైట్‌కు దగ్గరగా వెళ్లిన ట్రంప్ మెరైన వన్ హెలికాప్టర్
భారీ వర్షానికి కూలిన ఇల్లు.. నాలుగు నెలల పసికందు సహా ఆరుగురు మృతి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

MIM | ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌పై బహిష్కరణ వేటు.. అసదుద్దీన్ నోరు విప్పాలి: సల్మాన్ ఖాన్
ఆగస్టు 29, 2026

Bigg Boss | జెన్ జీ నిరసనతో ఫేమస్ – ఏకంగా బిగ్‌బాస్‌లో ఛాన్స్ కొట్టేసిన రియా!
ఆగస్టు 27, 2026

Janhvi Kapoor | అమ్మానాన్నల పెళ్లి స్వర్గంలోనే.. జాన్వీ చిన్ననాటి కామెంట్స్ వైరల్..
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు
- ●MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి
- ●Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●KCR Fake Tweet Controversy | రేవంత్ రెడ్డే సంధ్యారావు.. సంధ్యారావే రేవంత్ రెడ్డి
- ●Jayam Ravi | వెంకటేశ్వరస్వామిగా జయం రవి - మంచు మనోజ్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ

Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం

S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

MLC Venkatrami Reddy | వీర్లపల్లి శంకర్ మీద ఏం చర్యలు తీసుకున్నరో చెప్పాలి

Supreme Court | ఆన్లైన్లో అనుచిత కంటెంట్ నుంచి పిల్లల్ని రక్షించండి.. కేంద్రానికి సుప్రీం నోటీసులు



