House collapses | భారీ వర్షానికి కూలిన ఇల్లు.. నాలుగు నెలల పసికందు సహా ఆరుగురు మృతి
House collapses | ఉత్తరప్రదేశ్ ప్రతాప్‌గఢ్ (Pratapgarh) జిల్లాలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో నాలుగు నెలల పసికందు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
House collapses | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ప్రతాప్‌గఢ్ (Pratapgarh) జిల్లాలో సుమారు వందేళ్ల నాటి పురాతన భవనం కుప్పకూలిపోయింది (House collapses). ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నాలుగు నెలల పసికందు కూడా ఉండటం కలచివేస్తోంది.
యూపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతాప్‌గఢ్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కుండపోత వర్షం పడుతోంది. ఈ వర్షానికి మహూలీ బజార్‌లో ఉన్న ఓ పురాతన ఇల్లు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో ఆ ఇంట్లోని వాళ్లంతా గాఢ నిద్రలో ఉన్నారు. వారంతా శిథిలాల కిందే సమాధి అయ్యారు. మృతుల్లో ఇద్దరు శిశువులు (నాలులు నెలలు, రెండేళ్ల పిల్లలు) కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిటీ సర్కిల్ ఆఫీసర్ ఆశుతోష్ మిశ్రా తెలిపారు.
Also Read..
ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు.. యూపీలో బీఎస్పీకి ఎదురుదెబ్బ
స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. పెట్టుబడిదారులపై అమ్మకాల ఒత్తిడి..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ






