Ration Card | ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డుల పంపిణీ..
Ration Card | రాష్ట్రంలోని రేషన్ కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంగ్రెస్ సర్కార్ అంత్యంత్ర ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది.
Ration Card | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని రేషన్ కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. కాంగ్రెస్ సర్కార్ అంత్యంత్ర ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు చేసింది. పంద్రాగస్టు (ఆగస్టు 15న) రోజున కొత్తగా మంజూరైన, లామినేట్ చేసిన 1.05 కోట్ల పీడీఎస్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్త తెల్ల రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నామని మంత్రి తెలిపారు. ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుక ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పారు. పేదల ఆహార భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని, అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు లామినేటెడ్ (పీవీసీ) రూపంలో రూపొందించిన నూతన రేషన్ కార్డులను అందించనున్నారు. వాటర్‌ప్రూఫ్, డెబిట్, క్రెడిట్ కార్డు పరిమాణంలో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డు (Smart Ration Cards)లపై క్యూఆర్ కోడ్‌తో (QR Code) పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను పొందుపరిచారు.
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ





