త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salman Khan | స‌ల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియ‌రెన్స్‌ – లాంగెస్ట్ ర‌న్‌టైమ్‌తో ట్రైల‌ర్‌

సెన్సార్ బోర్డ్‌తో స‌ల్మాన్ ఖాన్ సాగించిన పోరాటం ఫ‌లించింది. మాతృభూమికి సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేయ‌బోతున్నారు. నాలుగు నిమిషాల న‌ల‌భై మూడు సెకండ్ల లాంగెస్ట్ ర‌న్‌టైమ్‌తో ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌బోతున్నారు.

N

Entertainment | Published On Nov 5, 2026, 5.37 pm IST

Salman Khan | స‌ల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ క్లియ‌రెన్స్‌ – లాంగెస్ట్ ర‌న్‌టైమ్‌తో ట్రైల‌ర్‌
Advertisement

Salman Khan |స‌ల్మాన్ మాతృభూమి సినిమాకు సెన్సార్ అడ్డంకుల నుంచి ఊర‌ట ల‌భించింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ సెన్సార్ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తూ స్వ‌యంగా మాతృభూమి సినిమాను నిర్మిస్తోన్నారు. వార్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అపూర్వ ల‌ఖియా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 2020లో భార‌త్‌, చైనా సైన్యం మ‌ధ్య గ‌ల్వాన్ లోయలో జ‌రిగిన యుద్దం ఆధారంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ యుద్ధంలో యాభై మంది సైన్యంతో కూడిన భార‌త ఆర్మీ...వంద‌లాది మంది చైనా సైనికుల‌ను ఎదురించి స్ఫూర్తిదాయ‌క విజ‌యాన్ని సాధించారు. ఈ వాస్త‌వ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకొని బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ పేరుతో స‌ల్మాన్ ఖాన్ సినిమాను అనౌన్స్‌చేశారు. షూటింగ్ కూడా పూర్తిచేశారు.

చైనాకు వ్య‌తిరేకంగా...

చైనాకు వ్య‌తిరేకంగా కొన్ని అంశాలు ఉండ‌టంతో పాటు దేశ‌భ‌ద్రత‌కు సంబంధించిన  సెన్సిటివ్ అంశాల‌ను సినిమాలో వాడారంటూ ర‌క్ష‌ణ శాఖ‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది.
ఈ అభ్యంత‌రాల‌తో సినిమా క‌థ‌లో స‌ల్మాన్ అండ్ టీమ్ చాలా మార్పులు చేశారు. చైనాకు వ్య‌తిరేకంగా ఉన్న డైలాగ్స్ తొలగించారు. ఆర్మీ సీన్ల‌లో కొన్ని ఛేంజెస్ చేశారు. దాదాపు న‌ల‌భై శాతం సినిమాను మ‌ళ్లీ కొత్త‌గా రీషూట్ చేశారు. దాదాపు ఆరేడు నెల‌ల పాటు సెన్సార్ బోర్డ్‌తో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సాగించిన సుదీర్ఘ‌ పోరాటం ఎట్ట‌కేల‌కు ఫ‌లించింది. ఈ మార్పుల త‌ర్వాత మాతృభూమికి సెన్సార్ బోర్డ్ నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చింది. యూ/ఏ స‌ర్టిఫికేట్ జారీ చేసింది.

రికార్డ్ ర‌న్‌టైమ్‌తో...

మాతృభూమి ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 6న రిలీజ్ చేయ‌బోతున్నారు. నాలుగు నిమిషాల న‌ల‌భై మూడు సెకండ్ల ర‌న్‌టైమ్‌తో ఈ ట్రైల‌ర్ విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం. ఇండియాలోనే లాంగెస్ట్ ర‌న్‌టైమ్ ట్రైల‌ర్స్‌లో ఒక‌టిగా మాతృభూమి రికార్డ్ క్రియేట్ చేయ‌బోతుంది. ఈ లిస్ట్‌లో నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల‌తో సింగం అగైన్ ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉంది. రెండో స్థానంలో మాతృభూమి నిల‌వ‌నుంద‌ని అంటున్నారు.

తెలంగాణ సైనికుడు...

మాతృభూమిలో చిత్రాంగ‌ద సింగ్‌, ముఖేష్ రిషి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమాలో గ‌ల్వాన్ వార్‌లో క‌న్నుమూసిన తెలంగాణ‌కు చెందిన క‌ల్న‌ల్ సంతోష్‌బాబు పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపించ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 20 లేదా డిసెంబ‌ర్ 11న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

 

Advertisement
Advertisement