త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Salman Khan | “మాతృభూమి” సెన్సార్ కాకుండా మోదీ ప్ర‌భుత్వం అడ్డుకుందా? – రూమ‌ర్ల‌పై స‌ల్మాన్ ఖాన్ రియాక్ష‌న్‌

మాతృభూమి సినిమా సెన్సార్ కాకుండా మోదీ ప్ర‌భుత్వం అడ్డుకున్న‌ట్లు వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల‌పై స‌ల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. అవ‌న్నీ అబ‌ద్దాల‌నేన‌ని చెప్పారు. వార్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతున్న‌ట్లు స‌ల్మాన్ ఖాన్ వెల్ల‌డించారు.

N

Entertainment | Published On Nov 6, 2026, 5.30 pm IST

Salman Khan | “మాతృభూమి” సెన్సార్ కాకుండా మోదీ ప్ర‌భుత్వం అడ్డుకుందా? – రూమ‌ర్ల‌పై స‌ల్మాన్ ఖాన్ రియాక్ష‌న్‌
Advertisement

Salman Khan |  మాతృభూమి సెన్సార్ వివాదంపై ఎట్ట‌కేల‌కు బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. ఈ సినిమాక‌థ‌, స‌న్నివేశాల‌పై మోదీ ప్ర‌భుత్వం నుంచి అభ్యంత‌రాలు ఎదురైన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. వార్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న మాతృభూమిలో స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టిస్తూ ఈ సినిమాను స్వ‌యంగా నిర్మిస్తున్నారు.

గ‌ల్వాన్ లోయ‌...

2020లో భార‌త్ - చైనా మ‌ధ్య గ‌ల్వాన్‌ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు అపూర్వ ల‌ఖియా ఈ సినిమాను రూపొందించారు. మాతృభూమి షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే పూర్త‌య్యింది. ఏప్రిల్‌లో సినిమాను రిలీజ్ చేయాల‌ని స‌ల్మాన్ అండ్ టీమ్ ప్లాన్ చేశారు. ఈ వార్ డ్రామా మూవీపై సెన్సార్ బోర్డ్‌తో పాటు ర‌క్ష‌ణ శాఖ నుంచి అభ్యంత‌రాలు ఎదుర‌య్యాయి. చైనాకు వ్య‌తిరేకంగా సినిమాలో ఉన్న స‌న్నివేశాల‌ను తొల‌గించాల్సిందేన‌ని ర‌క్ష‌ణ శాఖ ఆదేశించింది. యుద్ద స‌న్నివేశాలు, సంభాష‌ణల‌తో పాటు స‌ల్మాన్ ఖాన్ పాత్ర‌లో చాలానే మార్పులు చేయాల‌ని డిమాండ్ చేసింది. ర‌క్ష‌ణ శాఖ సూచ‌న‌ల‌తో మేక‌ర్స్ దాదాపు సినిమాను న‌ల‌భై శాతం రీషూట్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. తొలుత ఈ సినిమాకు బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ అనే టైటిల్ అనుకున్నారు.సీబీఎఫ్‌సీ ఆబెక్ష‌న్‌తోనే మాతృభూమిగా మార్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మోదీ ప్ర‌భుత్వం...

మాతృభూమి సినిమాలో మార్పుల‌కు మోదీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మంటూ వ‌స్తోన్న రూమ‌ర్ల‌పై ఎట్ట‌కేల‌కు స‌ల్మాన్ మౌనం వీడాడు. అవ‌న్నీ అస‌త్యాలేన‌ని అన్నారు. "సినిమా స్క్రిప్ట్ మార్చ‌మ‌ని ప్ర‌భుత్వంతో పాటు ఎవ‌రూ మాపై ఒత్తిడి తీసుకురాలేదు ర‌క్ష‌ణ శాఖ‌, సెన్సార్ బోర్డ్ నుంచి ఏ విధ‌మైన అభ్యంత‌రాలు ఎదురుకాలేదు. మా సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ రాకుండా ప్ర‌భుత్వం అడ్డుకుంద‌న్న‌ది కూడా అబ‌ద్దం. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల్లో సైనికుల‌కు ఎదురైన ప‌రిస్థితులు, ఆ స‌మ‌యంలో వారి కుటుంబాలు ఎదుర్కొన్న మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను వాస్త‌విక కోణంలో సినిమాలో చూపించాల‌ని అనుకున్నాం. అందుకే టైమ్ ఎక్కువ‌గా తీసుకున్నాం. ముందుగా అనుకున్న క‌థ‌లో చాలా ఛేంజెస్ చేశాం. ఇందులో ఎవ‌రిని నెగెటివ్‌గా చూపించ‌లేదు. ఎవ‌రికి మా సినిమా వ్య‌తిరేకం కాదు" అని అన్నారు. బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్ అన్న‌ది వ‌ర్కింగ్ టైటిల్‌గానే అనుకున్నామ‌ని, క‌థానుగుణంగా మాతృభూమి క‌రెక్ట్ అనిపించి టైటిల్ మార్చేశామ‌ని చెప్పారు.

రిలీజ్ డేట్‌

మాతృభూమి రిలీజ్ డేట్‌ను స‌ల్మాన్ ఖాన్ రివీల్ చేశారు. డిసెంబ‌ర్ 4న ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజైంది. ఇందులో చిత్రాంగ‌ద సింగ్‌, అపూర్వ ల‌ఖియా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.

 

Advertisement
Advertisement