త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?

Actor Prabhas | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ( Bharat Future City )లో పెట్టుబడుల ప్రక్రియ మరింత వేగవంతం కానున్నది. రాబోయే డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్( Global Summit ) నాటికి భూముల కేటాయింపులు, పెట్టుబడి ఒప్పందాలు, కేటాయింపు ప్రతిపాదనలపై స్పష్టత రానున్నది. ఇందులో భాగంగానే టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్‌( Prabhas )తో కూడా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టించే ప్రయత్నం చేస్తున్నది.

S

Telangana | Published On Nov 25, 2026, 7.20 pm IST

Actor Prabhas | ఫ్యూచర్ సిటీలో ప్రభాస్‌కు 500 ఎకరాలు..?
Advertisement

ఫిల్మ్ స్టూడియో పెట్టించే యోచనలో సర్కారు
10 వేల కోట్ల పెట్టుబడికి
ఇప్పటికే ఆసక్తి చూపిన సల్మాన్ ఖాన్
12 రకాల పారిశ్రామిక జోన్లకు
13,440 ఎకరాల రిజర్వ్
గ్లోబల్ సమ్మిట్ తర్వాత
ఊపందుకోనున్న భూ కేటాయింపులు

Actor Prabhas | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ( Bharat Future City )లో పెట్టుబడుల ప్రక్రియ మరింత వేగవంతం కానున్నది. రాబోయే డిసెంబర్ మొదటి వారంలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్( Global Summit ) నాటికి భూముల కేటాయింపులు, పెట్టుబడి ఒప్పందాలు, కేటాయింపు ప్రతిపాదనలపై స్పష్టత రానున్నది. ఇందులో భాగంగానే టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్‌( Prabhas )తో కూడా ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఆయన తలపెట్టిన ఫిల్మ్ స్టూడియోకు 500 ఎకరాలు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రభాస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంపై గ్లోబల్ సమ్మిట్ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

12 జోన్లు 30,000 ఎకరాలు

ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీ కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్–2047 పేరుతో సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ప్రణాళిక అమలు బాధ్యతలను ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పర్యవేక్షించనున్నది. వివిధ రంగాల అవసరాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీని 12 ప్రత్యేక జోన్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందులో అత్యధికంగా లైఫ్ సైన్సెస్ రంగానికి భూములను కేటాయించాలని నిర్ణయించారు. ఆయా జోన్లకు 13,440 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదించారు. సుమారు 15 వేల ఎకరాల హరిత ప్రాంతాలను కలుపుకొని మొత్తం ఫ్యూచర్ సిటీ 30 వేల ఎకరాల్లో ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

సల్మాన్ ప్రాజెక్టు తరహాలోనే?

ఫ్యూచర్ సిటీలో 500 ఎకరాల్లో 10 వేల కోట్ల రూపాయలతో హాలీవుడ్ తరహాలో సినీ స్టూడియో నిర్మించేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గత ఏడాది ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2025 అక్టోబర్ 30న ముంబైలో సల్మాన్ ఖాన్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబరు 8న నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో.. రంగారెడ్డి జిల్లా కందుకూరు సమీపంలో సల్మాన్ ఖాన్ వెంచర్స్ సంస్థ ఈ నిర్మాణం చేపడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇదే విషయాన్ని 2025 డిసెంబరు 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి తదనంతర వివరాలేవీ బయటికి రాలేదు. అయితే.. సల్మాన్ ప్రాజెక్టు తరహాలోనే ప్రభుత్వం.. హీరో ప్రభాస్‌కు ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఇది ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉన్నందున.. అధికారిక ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

Advertisement
Advertisement