Donald Trump | ప్రయాణికుల ఫ్లైట్‌కు దగ్గరగా వెళ్లిన ట్రంప్ మెరైన వన్ హెలికాప్టర్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రయాణిస్తున్న మెరైన వన్ హెలికాప్టర్ (Marine One helicopter) ప్రయాణికుల విమానానికి (passenger jet) అతి సమీపంలోకి వెళ్లింది. ఈ ఘటనతో అధికారులు కాసేపు టెన్షన్ పడ్డారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
International | Published On Aug 6, 2026, 11.03 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న మెరైన వన్ హెలికాప్టర్ (Marine One helicopter) ప్రయాణికుల విమానానికి (passenger jet) అతి సమీపంలోకి వెళ్లింది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Ronald Reagan Washington National Airport) సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. కాలిఫోర్నియా వెళ్లేందుకు అధ్యక్షుడు మధ్యాహ్నం 2:33 గంటలకు వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ హెలికాప్టర్‌లో బయల్దేరారు. ట్రంప్ హెలికాప్టర్ రొనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోకి వస్తున్న సమయంలో ఫ్లోరిడా వెళ్తున్న ప్రయాణికుల విమానం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. రెండు విమానాలూ దాదాపు చాలా దాగ్గరగా వచ్చాయి. నిబంధనల ప్రకారం ప్రెసిడెంట్ హెలికాప్టర్ వెళ్లే సమయంలో కమర్షియల్ విమానాల రాకపోకలను ట్రాఫిక్ కంట్రోలర్లు నిలిపివేయాలి. కానీ ఆ నిబంధన పాటించకపోవడంతో రెండు విమానాల మధ్య గ్యాప్ తగ్గి 'లాస్ ఆఫ్ సెపరేషన్' ఏర్పడింది. గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది వెంటనే పైలెట్లను అప్రమత్తం చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తునకు ఆదేశించాయి.
Also Read..
ఒక్క రోజులోనే రూ.28వేలు పెరిగిన పసిడి ధర.. మళ్లీ రెక్కలు..
భారీ వర్షానికి కూలిన ఇల్లు.. నాలుగు నెలల పసికందు సహా ఆరుగురు మృతి
ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు.. యూపీలో బీఎస్పీకి ఎదురుదెబ్బ
సంబంధిత వార్తలు

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026

Donald Trump | ట్రంప్ సంచలన ప్రకటన.. వైట్ హౌస్‌లో ఆ వార్తాసంస్థలపై నిషేధం
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



