Raghava Lawrence | డిప్యూటీ సీఎంగా రాఘవ లారెన్స్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫొటో
Raghava Lawrence | దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తమిళనాడు డిప్యూటీ సీఎంగా (Tamil Nadu deputy CM) బాధ్యతలు చేపట్టినట్లు ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అది కూడా రాఘవ లారెన్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటో పోస్టవడం ఆసక్తికరంగా మారింది.
Raghava Lawrence | తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. విజయ్ నేతృత్వంలోని టీవీకే నుంచి తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికల్లో (Trichy East Assembly constituency) పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ప్రచారం వేళ తాజాగా కీలక ఫొటో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది.
రాఘవ లారెన్స్ తమిళనాడు డిప్యూటీ సీఎంగా (Tamil Nadu deputy CM) బాధ్యతలు చేపట్టినట్లు ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అది కూడా రాఘవ లారెన్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటో పోస్టవడం ఆసక్తికరంగా మారింది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనిపై పలువురు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఇన్‌స్టా అకౌంట్ ఫేక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ ఇటీవలే సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. డబ్బు సంపాదించాలనో లేదా పదవులు ఆశించో ఈ నిర్ణయం తీసుకోలేదని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు. తన పొలిటికల్ ఎంట్రీపై ప్రజలు, అభిమానుల అభిప్రాయాన్ని కోరారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు. లేదంటే తన ఆలోచనను విరమించుకుంటానని పేర్కొన్నారు. వీడియో చూసిన అనంతరం సలహాలు, సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేయాలని రాఘవ లారెన్స్ స్పష్టం చేశారు.
Also Read..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Airtel | ఆర్మీతో చేతులు కలిపిన ఎయిర్టెల్.. అరుణాచల్ పర్వతాల్లోనూ ఇక నెట్వర్క్ ..
- ●Student Visa | విద్యార్థులారా.. విదేశీ స్టూడెంట్ వీసాకు ముందు ఇవి తప్పనిసరి..
- ●RSS office | ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి
- ●PM Modi | వారి భద్రత మనందరి బాధ్యత.. నావికుల మృతిపై ట్రంప్ సమక్షంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
- ●Gene Therapy | వృద్ధాప్యానికి చెక్? మానవుల్లో తొలి జీన్ థెరపీ పరీక్ష ప్రారంభం..
- ●Telangana Education Commission | విద్యా కమిషన్ సిఫార్సులు ఏమైనట్టు!

Airtel | ఆర్మీతో చేతులు కలిపిన ఎయిర్టెల్.. అరుణాచల్ పర్వతాల్లోనూ ఇక నెట్వర్క్ ..

Student Visa | విద్యార్థులారా.. విదేశీ స్టూడెంట్ వీసాకు ముందు ఇవి తప్పనిసరి..

RSS office | ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి

PM Modi | వారి భద్రత మనందరి బాధ్యత.. నావికుల మృతిపై ట్రంప్ సమక్షంలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ






