త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | రెండోసారి త‌ల్లికాబోతున్న స్టార్ న‌టి

Kiara Advani | బాలీవుడ్ స్టార్ క‌పుల్స్‌ కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మ‌ల్హోత్రా (Sidharth Malhotra) రెండోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

D

Movies | Published On Oct 7, 2026, 12.44 pm IST

Kiara Advani | రెండోసారి త‌ల్లికాబోతున్న స్టార్ న‌టి
Advertisement

Kiara Advani | త్రినేత్ర న్యూస్ : బాలీవుడ్ స్టార్ క‌పుల్స్‌ కియారా అద్వానీ (Kiara Advani), సిద్ధార్థ్ మ‌ల్హోత్రా (Sidharth Malhotra) గుడ్ న్యూస్ చెప్పారు. తాము రెండోసారి త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ గుడ్ న్యూస్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేశారు. “మరోసారి దేవుడు మాకు అత్యంత గొప్ప బహుమతిని ప్రసాదించాడు. మా హృదయాలు ప్రేమతో, కృతజ్ఞతతో నిండిపోయాయి” అంటూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. ప‌లువురు సెల‌బ్రిటీలు, అభిమానులు కియారా-సిద్ధార్థ్ జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

కాగా, కియారా, సిద్ధార్థ్ జంట‌ 2023 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ జంట‌కు 2025లో కూతురు సారాయా మల్హోత్రా (Saraayah Malhotra) జన్మించింది. ఇప్పుడు రెండో బిడ్డ‌ను (second child) త‌మ కుటుంబంలోకి ఆహ్వానిస్తోంది. కాగా, కబీర్ సింగ్, షేర్షా, జుగ్ జుగ్ జియో, సత్యప్రేమ్ కీ కథ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియారా.. చివరగా య‌శ్ టాక్సిక్ చిత్రంలో కనిపించారు. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏక్ విలన్, కపూర్ అండ్ సన్స్, యోధా వంటి చిత్రాలతో అలరించారు.

Also Read..

ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే నా బ‌లం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్ర‌ధాని మోదీ

సీఈసీకి వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌.. రాహుల్‌, ప్రియాంక‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

25 ఏళ్ల ప్ర‌జాప్ర‌స్థానం.. వినాయ‌కుడికి ప్ర‌ధాని ప్ర‌త్యేక పూజ‌లు

Advertisement
Advertisement