Tamannaah | సూర్యాస్తమయం తర్వాత అడవిలో ఆడుగుపెడితే మరణమే – సైలెంట్‌గా ఓటీటీలోకి తమన్నా హారర్ మూవీ
తమన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ హారర్ మూవీ ది వాన్ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటించిన ఈ బాలీవుడ్ మూవీకి పంచాయత్ ఫేమ్ దీపక్‌కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Nov 6, 2026, 4.42 pm IST
Tamannaah | మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించిన ది వాన్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించాడు. పంచాయత్ వెబ్‌సిరీస్ ఫేమ్ దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించారు.
ఓటీటీలోకి...
ది వాన్ మూవీ సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. అయితే ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు అదనంగా 349 రూపాయలు చెల్లించాలి. నవంబర్ ఇరవై నుంచి ఫ్రీ స్ట్రీమింగ్ ఉండొచ్చని అంటున్నారు.
డిజాస్టర్...
150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ది వాన్ మూవీ థియేటర్లలో 75 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. డిజాస్టర్‌గా నిలిచింది. బీహార్‌లోని మా వన్ దేవి ఆలయం గురించి ప్రజల్లో ఉన్న నమ్మకాలు, విశ్వాసాల నుంచి స్ఫూర్తి పొంది దర్శకుడు దీపక్ కమార్ మిశ్రా మూవీని తెరకెక్కించారు. కాన్సెప్ట్ బాగున్నా ఉత్కంఠభరితంగా చెప్పడంలో దర్శకుడు తడబడిపోవడంతో ది వాన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఛత్ పూజ కోసం...
రిషి, మమత భార్యభర్తలు. ముంబైలో ఇంజినీర్‌గా పనిచేస్తుంటాడు రిషి. ఛఠ్ పూజ కోసం సొంతూరికి వస్తాడు రిషి. ఆ ఊరికి సమీపంలో ఉన్న దేవ్‌వన్‌కు సంబంధించి గ్రామస్తులు కొన్ని కఠిన నియమాలు పాటిస్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత అడవిలో ఎవరూ అడుగుపెట్టకూడదని రూల్ పెట్టుకుంటారు. కొన్ని పరిస్థితుల కారణంగా రిషి ఆ నిబంధనను అతిక్రమిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? గత జన్మలో దేవవన్ కారణంగానే చనిపోయిన వీర్ అనే రాజుకు రిషికి ఉన్న సంబంధమేమిటన్నదే ఈ మూవీ కథ.
లాంగ్ రన్నింగ్‌లో...
చాలా రోజుల తర్వాత తమన్నా హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ఇది. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది మిల్కీ బ్యూటీ. ఓపెనింగ్స్ బాగానే రాబట్టిన లాంగ్ రన్నింగ్‌లో థియేటర్లలో నిలవలేకపోయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bollywood OTT | క్రికెట్ బెట్టింగ్‌లో హీరోకు నష్టాలు – సడెన్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు హీరోయిన్ బాలీవుడ్ మూవీ
నవంబర్ 5, 2026

OTT | ఇదేం ట్విస్ట్…800 కోట్ల బ్లాక్‌బస్టర్ – రిలీజై నెలకాకముందే ఓటీటీలోకి…
నవంబర్ 5, 2026

Kiara Advani | భర్త సినిమాలో హీరోయిన్‌గా కియారా – బాలీవుడ్ నటి బయోపిక్‌పై రూమర్లు
అక్టోబర్ 22, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు
- ●Meta Muse | మెటా మ్యూస్‌లో ఇక వాయిస్ చాటింగ్.. మాట్లాడే అవతార్లు కూడా..
- ●NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు
- ●Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్
- ●Tummal Nageshwar Rao | వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతాం.. రైతుల ఆదాయం పెంచుతాం..
- ●Cyber Criminals | సైబర్ నేరగాళ్లకు సమాజంలో చోటు లేదు.. జైళ్లలో మగ్గిపోవడమే వారికి సరైన శిక్ష : సుప్రీంకోర్టు

Ponnam Prabhakar | బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు స్టైపెండ్ పెంపు

Meta Muse | మెటా మ్యూస్‌లో ఇక వాయిస్ చాటింగ్.. మాట్లాడే అవతార్లు కూడా..

NEHS | ఉద్యోగులకు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు నిరాకరిస్తే చర్యలు

Salman Khan | "మాతృభూమి" సెన్సార్ కాకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుందా? - రూమర్లపై సల్మాన్ ఖాన్ రియాక్షన్



