త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | భ‌ర్త సినిమాలో హీరోయిన్‌గా కియారా – బాలీవుడ్ న‌టి బ‌యోపిక్‌పై రూమ‌ర్లు

బాలీవుడ్ రియ‌ల్ లైఫ్ క‌పుల్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ కాంబినేష‌న్‌లో ఓ బ‌యోపిక్ రాబోతుంది. అల‌నాటి దిగ్గ‌జ న‌టి మీనా కుమారి జీవితం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న కియారా అద్వానీ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Oct 22, 2026, 5.53 pm IST

Kiara Advani  | భ‌ర్త సినిమాలో హీరోయిన్‌గా కియారా – బాలీవుడ్ న‌టి బ‌యోపిక్‌పై రూమ‌ర్లు
Advertisement

Kiara Advani | బాలీవుడ్ రియ‌ల్‌లైఫ్‌ క‌పుల్ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ ఐదేళ్ల త‌ర్వాత క‌లిసి సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రు క‌లిసి ఓ బ‌యోపిక్ సినిమా చేస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. సిద్ధార్థ్‌, కియారా కాంబినేష‌న్‌లో గ‌తంలో షేర్‌షా మూవీ వ‌చ్చింది. 2021లో రిలీజైన ఈ మూవీ నేష‌న‌ల్ అవార్డును గెలుచుకుంది. షేర్‌షా షూటింగ్‌లోనే సిద్ధార్థ్, కియారా ప్రేమ‌లో ప‌డ్డారు. 2023లో పెళ్లిపీట‌లు ఎక్కారు.

ఐదేళ్ల త‌ర్వాత‌...

ఐదేళ్ల గ్యాప్ త‌ర్వాత భ‌ర్త సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో కియారా అద్వానీ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అల‌నాటి దిగ్గ‌జ బాలీవుడ్ న‌టి మీనా కుమారి జీవితం ఆధారంగా క‌మ‌ల్ ఔర్ మీనా పేరుతో బ‌యోపిక్ మూవీ రూపొందుతోంది. టాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అయిన మీనాకుమారి 38 ఏళ్ల వ‌య‌సులోనే ఎలా క‌న్నుమూసింది ? డైరెక్ట‌ర్ క‌మ‌ల్ అమ్రోహీతో ఆమె విఫ‌ల ప్రేమాయ‌ణంతో ఈ బ‌యోపిక్‌ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం.

మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా...

ఈ సినిమాలో మీనా కుమారి పాత్ర‌లో కియారా అద్వానీ క‌నిపించ‌బోతున్న‌ట్లు చాలా కాలంగా వార్త‌లొస్తున్నాయి. క‌మ‌ల్ అమ్రోహీ క్యారెక్ట‌ర్ కోసం మేక‌ర్స్ సైఫ్ అలీఖాన్‌ను అప్రోచ్ అయ్యారు. కానీ డేట్ ఇష్యూస్‌తో పాటు మేక‌ర్స్‌తో ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా ఈ బాలీవుడ్ సీనియ‌ర్ హీరో ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్‌...

సైఫ్ అలీఖాన్ స్థానంలో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను హీరోగా ఎంపిక‌చేసిన‌ట్లు స‌మాచారం. ల‌వ‌క్ బాయ్ ఇమేజ్‌తో కూడిన క్యారెక్ట‌ర్ కావ‌డంతో ఈ బ‌యోపిక్‌లో న‌టించ‌డానికి సిద్ధార్థ్ కూడా అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, కియారా అద్వానీ కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఈ జీవిత క‌థ‌లో త్రిప్తి డిమ్రి మ‌రో ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

 

 

 

Advertisement
Advertisement