త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | ‘అబ్‌ బస్‌ హో గయా’.. రెండో బేబీ తర్వాత ఇక పిల్లలు వద్దంటున్న కియారా!

Kiara Advani | బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఉన్న చిలిపి కెమిస్ట్రీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్‌ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో వెలుగుచూశాయి. ముఖ్యంగా పిల్లలు, డేట్‌ నైట్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఈ జంట ఇచ్చిన సమాధానాలు నవ్వులు పూయించాయి. ప్రస్తుతం రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట.. షోలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలను పంచుకుంది.

P

Entertainment | Published On Nov 11, 2026, 12.02 pm IST

Kiara Advani | ‘అబ్‌ బస్‌ హో గయా’.. రెండో బేబీ తర్వాత ఇక పిల్లలు వద్దంటున్న కియారా!
Advertisement

Kiara Advani | బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇద్దరి మధ్య ఉన్న చిలిపి కెమిస్ట్రీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్‌ టాక్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’లో వెలుగుచూశాయి. ముఖ్యంగా పిల్లలు, డేట్‌ నైట్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఈ జంట ఇచ్చిన సమాధానాలు నవ్వులు పూయించాయి. ప్రస్తుతం రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట.. షోలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సరదా విషయాలను పంచుకుంది.

బెడ్‌రూమ్‌లో రోల్‌ప్లే వద్దంటూ సిద్ధార్థ్‌ కామెంట్‌

షోలో భాగంగా కరణ్‌ జోహార్‌.. మీరిద్దరూ ఏదైనా ప్రత్యేకమైన క్యారెక్టర్లలో రోల్‌ప్లే చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా? అని ప్రశ్నించాడు. దీనికి సిద్ధార్థ్‌ మల్హోత్రా ఏమాత్రం తడబడకుండా తనదైన హాస్యంతో సమాధానమిచ్చాడు. ‘మా పనిని ఇంటికి తీసుకురావాలని మేం అనుకోవడం లేదు. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లోకి మా వర్క్‌ను తీసుకురావడం అసలే ఇష్టం లేదు’ అంటూ చమత్కరించాడు. సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించే తాము.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు సరదాగా చెప్పుకొచ్చాడు.

డేట్‌ నైట్స్‌పై ప్రశ్న.. కియారా అదిరిపోయే ఆన్సర్‌

ఇక కరణ్‌ జోహార్‌ అంతటితో ఆగకుండా మరో ఆసక్తికరమైన ప్రశ్న సంధించాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి డేట్‌ నైట్‌కు వెళ్లినప్పుడు.. అది కేవలం డెజర్ట్‌తోనే ముగిసిపోకుండా ఉండేందుకు ఏం చేస్తారు? అని అడిగాడు. ఈ ప్రశ్నకు ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కియారా అద్వానీ వెంటనే తన బేబీ బంప్‌పై చేయి వేసి.. ‘అబ్‌ బస్‌ హో గయా’ (ఇక చాలు.. ఇప్పటికి సరిపోయింది) అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. కియారా ఇచ్చిన ఈ సమాధానంతో అక్కడ నవ్వులు విరిశాయి. రెండో బిడ్డ రాకతో తమ కుటుంబం పూర్తయినట్లేనని, ఇక పిల్లల విషయంలో తనకు ఇదే చివరి నిర్ణయమనే అర్థం వచ్చేలా ఆమె సరదాగా స్పందించింది. కరణ్‌ అడిగిన ప్రశ్నకు కియారా ఇచ్చిన చమత్కారమైన బదులు షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

త్వరలో రెండో బిడ్డ రాక

కాగా, కియారా అద్వానీ, సిద్ధార్థ్‌ మల్హోత్రా 2023లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది ఈ దంపతులు తమ తొలి సంతానంగా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవలే మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పారు. ఈ క్రమంలో ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో కియారా చేసిన ‘అబ్‌ బస్‌ హో గయా’ వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన కుటుంబంలోకి రెండో చిన్నారి రాక కోసం ఎదురుచూస్తున్న వేళ.. ఇక పిల్లలు వద్దనే సంకేతాన్ని ఆమె సరదాగా ఇచ్చిందంటూ అభిమానులు ఈ వ్యాఖ్యలను ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Advertisement
Advertisement