Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
Actor Dhanush | తమిళ స్టార్ ధనుష్ (Actor Dhanush) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం (Thamizhaga Ezhuchi Kazhagam) పేరుతో పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది.
Actor Dhanush | త్రినేత్ర న్యూస్ : సౌత్ పాలిటిక్స్‌ను (South Indian politics) సినిమా నటులు (film stars) శాసిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, ఎంజేఆర్, జయలలిత వంటి తారలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత కాలంలోనూ దక్షిణాది రాజకీయాల్లో తారల హవా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టగా.. అటు తమిళనాడులో దళపతి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. పలువురు తారలు సైతం వారి బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు.
పార్టీ పేరు ఇదే..
ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ (Actor Dhanush) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాట కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం (Thamizhaga Ezhuchi Kazhagam) పేరుతో పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంపై ధనుష్ తన మామ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కూడా సంప్రదించి మద్దతు కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
2031 ఎన్నికలే లక్ష్యం
కొన్ని నెలలుగా తన అభిమాన సంఘాలతో ధనుష్ వరుస సమావేశాలు నిర్వహించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది. ధనుష్ 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీపై ధనుష్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తమిళ రాజకీయాల్లో విజయ్ సంచలన విజయంతో అధికారాన్ని చేపట్టి పాలనలో మార్క్ చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తినెలకొంది. ఒక వేళ ధనుష్ నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. విజయ్‌లానే రాజకీయ రణరంగంలో విజయం సాధిస్తారా..? లేదా..? అనేది ముందు ముందు చూడాలి. ధనుష్‌తోపాటూ పలువురు నటులు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది.
Also Read..
ఈసీ నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం
సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన.. రాహుల్, ప్రియాంకపై ఎఫ్ఐఆర్ నమోదు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gold Price | ఆర్బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..
- ●Manne Krishank | నాకు చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 వెట్సైట్కి ఎందుకంత బాధ: మన్నె క్రిశాంక్
- ●Supreme Court | ఈసీ నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం
- ●Kiara Advani | రెండోసారి తల్లికాబోతున్న స్టార్ నటి
- ●PM Modi | ప్రజల ఆశీర్వాదమే నా బలం.. ప్రతి అనుభవం ఓ పాఠమే : ప్రధాని మోదీ
- ●Paytm | పేటీఎం-వీసా బంఫర్ ఆఫర్.. మెట్రో టిక్కెట్లు, రీచార్జిలపై 50 శాతం డిస్కౌంట్..

Gold Price | ఆర్బీఐ రేటు పెంపుతో బంగారం మరింత పడుతుందా? కీలక స్థాయిలివే..

Manne Krishank | నాకు చట్టపరంగా బెయిల్ వస్తే.. తెలుగు 360 వెట్సైట్కి ఎందుకంత బాధ: మన్నె క్రిశాంక్

Supreme Court | ఈసీ నియామకాలపై భిన్న తీర్పులు.. పరిశీలిస్తామన్న సీజేఐ ధర్మాసనం

Kiara Advani | రెండోసారి తల్లికాబోతున్న స్టార్ నటి






