Donald Trump | ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
Donald Trump | ఇరాన్‌తో యుద్ధం (Iran war) ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌తో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, ఈ విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం అమెరికాదేనని స్పష్టం చేశారు.
International | Published On Mar 9, 2026, 1.31 pm IST
Donald Trump | మిడిల్ ఈస్ట్ (Middle East)లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్ (Iran)పై యుద్ధం పదో రోజుకు చేరింది. టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి (Israel-US Strikes). అదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా ఎంబసీలు, వైమానిక స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇలా దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. ఈ క్రమంలో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించే విషయంపై ఇజ్రాయెల్‌తో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే, ఈ విషయంలో అంతిమ నిర్ణయం మాత్రం అమెరికాదేనని స్పష్టం చేశారు. 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' పత్రికకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగించే చర్చల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా భాగస్వామి అవుతారని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, అమెరికా తన దాడులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నా.. ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించొచ్చా..? అని ట్రంప్‌ను విలేకరు ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. "అంత అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు" అని సమాధానమిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read..
కరూర్ తొక్కిసలాట ఘటన.. టీవీకే చీఫ్ విజయ్‌కి మరోసారి సమన్లు పంపిన సీబీఐ
IRIS లావన్‌కు ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు : జైశంకర్
హింస దేనికీ పరిష్కారం కాదు.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన
సంబంధిత వార్తలు

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
జులై 4, 2026

Donald Trump | భారత్-పాక్ యుద్ధాన్ని అలా ఆపాను.. మళ్లీ పాతపాటే ఎత్తుకున్న ట్రంప్
జులై 3, 2026

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: ‘అరామ్కో’ హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



