Iran Oil Depot | ఇరాన్ చమురు కేంద్రాలపై ఐడీఎఫ్ దాడులు.. ఇజ్రాయెల్‌పై అమెరికా అసహనం
Iran Oil Depot | టెహ్రాన్‌లోని ఆయిల్ డిపోలు, రిఫైనరీ కాంప్లెక్సులపై (Iran Oil Depot) ఐడీఎఫ్ దాడులపై అగ్రరాజ్యం (White House) అమెరికా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ ముందుగానే వాషింగ్టన్‌కు సమాచారం అందించినప్పటికీ.. యూఎస్ ఊహించిన దానికంటే దాడుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
International | Published On Mar 9, 2026, 2.01 pm IST
Iran Oil Depot | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్-అమెరికా దళాలు ఇరాన్‌లోని (Iran) సైనిక స్థావరాలు, వ్యూహాత్మక స్థలాలు, బంకర్లే లక్ష్యంగా దాడులు చేపడుతున్నాయి. ఈ క్రమంలో టెహ్రాన్‌లోని ఆయిల్ డిపోలు, రిఫైనరీ కాంప్లెక్సులపై (Iran Oil Depot) ఇజ్రాయెల్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఐడీఎఫ్ జరిపిన ఈ దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ఈ దాడుల వల్ల భారీ అగ్నిప్రమాదాలు సంభవించి నలుగురు వ్యక్తులు మరణించారు. అంతేకాదు, చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలకు భారీ నష్టం కలిగింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ 100 డాలర్లలోపే ఉన్న బ్యారెల్ క్రూడాయిల్ ధర ఇప్పుడు తొలిసారి 100 డాలర్లు దాటి 110 డాలర్లకు చేరుకుంది.
ఈ నేపథ్యలో ఐడీఎఫ్ దాడులపై అగ్రరాజ్యం (White House) అమెరికా అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ దాడుల గురించి ఇజ్రాయెల్ ముందుగానే వాషింగ్టన్‌కు సమాచారం అందించినప్పటికీ.. యూఎస్ ఊహించిన దానికంటే దాడుల తీవ్రత చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ దాడుల స్థాయిని చూసి అమెరికా సైనిక వర్గాలే ఆశ్చర్యపోయారట. "ఇది మంచి ఆలోచన కాదని మేము భావిస్తున్నాము" అని అమెరికాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ దాడులపై ఇజ్రాయెల్‌కు వాషింగ్టన్ WTF సందేశం పంపినట్లు (White House Sent WTF Message To Israel) పేర్కొన్నారు. అందులో ఇజ్రాయెల్ దాడులపై అమెరికా అసహనం వ్యక్తం చేసినట్లు సదరు అధికారి వెల్లడించారు. అయితే, ఇరాన్ చమురు శుద్ధి కేంద్రాలను మిస్సైల్స్ ప్రయోగించేందుకు వాడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందువల్లే దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ విషయంపై అటు వైట్‌హౌస్ గానీ, ఐడీఎఫ్ గానీ అధికారికంగా స్పందించలేదు.
ఒక్కసారిగా పెరిగిన ముడి చమురు ధరలు..
ఇజ్రాయెల్ దాడి జరిగిన మరుసటి రోజు నుంచే ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే యుద్ధం కారణంగా ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ జలసంధిని దాటే ప్రయత్నం చేసే నౌకలకు నిప్పుపెడతామని హెచ్చరించింది. ఫలితంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. ఫలితంగా ముడి చమురు ధరలు భారీగా పెరగుతున్నాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత మొదటిసారిగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల రెడ్‌లైన్‌ను దాటాయి.
చికాగో మెర్కాంటైల్ ఎక్స్ఛేంజ్‌లో సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 16.5 శాతం పెరిగి.. 107.97 డాలర్లకు చేరుకుంది. ఇది శుక్రవారం ముగింపు సమయంలో 92.69 డాలర్లుగా ఉంది. ఇక అమెరికాలో ఉత్పత్తి అయ్యే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు ధర బ్యారెల్‌కు 106.22 డాలర్లుగా నమోదైంది. ఇది గత వారం ముగింపు ధర కంటే సుమారు 16.9 శాతం అధికం. ఇరాన్ ఆయిల్ డిపోలు, రిఫైనరీ కాంప్లెక్సులపై (Iran Oil Depot) ఇజ్రాయెల్ దాడులు జరిపిన తర్వాత ధరలు ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
https://x.com/Osint613/status/2030405527272837219
Also Read..
ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
IRIS లావన్‌కు ఆశ్రయం కల్పించినందుకు భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు : జైశంకర్
హింస దేనికీ పరిష్కారం కాదు.. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులపై రాజ్యసభలో కేంద్రం ప్రకటన
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






