త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Marco Rubio India Visit | అమెరికా విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీ భేటీ.. ఆసక్తికరంగా మారిన ‘వైట్ హౌస్’ ఆహ్వానం

వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో ప్రధాని మోదీ కీలక చర్చలు జరిపారు. ట్రంప్ తరపున మోదీకి వైట్‌హౌస్ ఆహ్వానం అందింది.

J

National | Published On May 23, 2026, 6.09 pm IST

Marco Rubio India Visit | అమెరికా విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీ భేటీ.. ఆసక్తికరంగా మారిన ‘వైట్ హౌస్’ ఆహ్వానం
Advertisement

Marco Rubio India Visit | త్రినేత్ర.న్యూస్ : భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి (US Secretary of State) మార్కో రుబియో శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో కీలక సమావేశం నిర్వహించారు. వాణిజ్యం (Trade), ఇరు దేశాల భద్రత తదితర అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున.. ప్రధాని మోదీకి రుబియో 'వైట్ హౌస్' (White House) ఆహ్వానాన్ని అందించారు.

ట్రంప్ 2.0 (Trump 2.0) హయాంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య, ఇంధనపరమైన ఒడిదుడుకులు నెలకొన్న తరుణంలో.. రుబియో మూడు రోజుల భారత పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

భద్రత, టెక్నాలజీపై ఫోకస్

ప్రధాని మోదీ, రుబియో సమావేశంలో పాల్గొన్న యూఎస్ రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor) భేటీకి సంబంధించిన ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.

"భద్రత, వాణిజ్యం, క్రిటికల్ టెక్నాలజీల విషయంలో యూఎస్-ఇండియా సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మా మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయి. అమెరికాకు భారత్ ఒక కీలక భాగస్వామి!" అని సెర్గియో గోర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అలాగే, త్వరలోనే మోదీ వైట్ హౌస్‌కు రానున్నారని ఆయన వెల్లడించారు.

PM Modi Invited to White House Holds Key Talks with US Sec of State Marco Rubio

ప్రధాని మోదీ ఏమన్నారంటే..?

రుబియోతో సమావేశం అనంతరం ప్రధాని మోదీ కూడా స్పందించారు. "ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించాం. ఇండియా-యూఎస్ సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌లో (Comprehensive Global Strategic Partnership) నిరంతర పురోగతి సాధించే దిశగా మా చర్చలు సాగాయి. ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్, అమెరికా కలిసే పనిచేస్తాయి" అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా, ఇరాన్ వివాదం నేపథ్యంలో 'ప్రపంచ శాంతి' గురించి మోదీ ప్రస్తావించడం గమనార్హం.

PM Modi Invited to White House Holds Key Talks with US Sec of State Marco Rubio

ట్రంప్ 2.0: ఒడిదుడుకుల మధ్య సంబంధాలు

ఫిబ్రవరి 2025లో ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత.. వైట్ హౌస్‌లో ఆయన్ను కలిసిన తొలి ప్రపంచ నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. అప్పుడు మోదీని "గొప్ప స్నేహితుడు" అని అభివర్ణించిన ట్రంప్, 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుతామని ప్రకటించారు.

కానీ ఆ తర్వాతి నెలల్లోనే పరిస్థితిలో మార్పులు వచ్చాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో.. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ ఏకంగా 50% టారిఫ్‌లు విధించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌కు రావడంతో, ఆ టారిఫ్‌లను 18% శాతానికి తగ్గించారు. ప్రస్తుతం ఇరాన్-మిడిల్ ఈస్ట్ పరిణామాల వల్ల అధికారిక వాణిజ్య ఒప్పందం (Trade deal) పై సంతకాలు కాస్త ఆలస్యమవుతున్నాయి.

వచ్చే నెల ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 సమ్మిట్‌ (G7 Summit) కు ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లనున్నారు. అక్కడే మోదీ-ట్రంప్ మధ్య కీలక సమావేశం జరిగే అవకాశం ఉంది.

మార్కో రుబియో పర్యటన ప్రత్యేకత ఇదే..

చైనా పర్యటన అంతగా సక్సెస్ కాకపోవడంతో, భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే వ్యూహంతోనే మార్కో రుబియో ఢిల్లీలో అడుగుపెట్టారు. విశేషం ఏమిటంటే.. రుబియో తన పర్యటనను ముందుగా కోల్‌కతా నుంచి ప్రారంభించారు. అక్కడ సెయింట్ థెరిసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయమైన 'మదర్ హౌస్'ను సందర్శించారు. 14 ఏళ్ల తర్వాత ఒక ఉన్నత స్థాయి అమెరికా అధికారి కోల్‌కతాను సందర్శించడం ఇదే తొలిసారి. (2012లో హిల్లరీ క్లింటన్ వెళ్లారు).

ఆ తర్వాత ఢిల్లీ చేరుకున్న రుబియో.. మే 26న జరగనున్న క్వాడ్ (Quad) దేశాల (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్నారు. ట్రంప్ తన తొలి ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన క్వాడ్ కూటమికి, ఇప్పుడు మళ్లీ జీవం పోయాలని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రుబియో పర్యటన ఎలాంటి ఫలితాలను ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

PM Modi Invited to White House Holds Key Talks with US Sec of State Marco Rubio

Advertisement

తాజావార్తలు

Advertisement