White House Shooting | వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. దుండగుడు మృతి..
White House Shooting | అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు (White House Shooting) కలకలం సృష్టించాయి. శ్వేతసౌధం (White House) వెలుపల ఉన్న యూఎస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ (Checkpoint) వద్ద ఓ దుండగుడు బుల్లెట్ల వర్షం కురిపించాడు.
International | Published On May 24, 2026, 6.41 am IST
White House Shooting | త్రినేత్ర.న్యూస్: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు (White House Shooting) కలకలం సృష్టించాయి. శ్వేతసౌధం (White House) వెలుపల ఉన్న యూఎస్ సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ (Checkpoint) వద్ద ఓ దుండగుడు బుల్లెట్ల వర్షం కురిపించాడు. సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపాడు. ప్రతిగా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు. ఈ ఘటన వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల ఉన్న 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ నార్త్‌వెస్ట్ మూలలో ఈ కాల్పులు జరిగినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు ధృవీకరించారు.
వైట్‌హౌస్ చెక్‌పాయింట్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి తన బ్యాగ్‌లో ఉన్న ఆయుధం తీసి ఒక్కసారిగా గాల్లోకి కాల్పులు ప్రారంభించాడు. దుండగుడు మొత్తం 20 రౌండ్లు కాల్పులు జరిపాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లపైకి కూడా అతను కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన వైట్‌హౌస్ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.

దుండగుడు మృతి..
ఈ కాల్పుల్లో నిందితుడితోపాటు, ఓ సాధారణ పౌరుడు గాయపడ్డారు. దీంతో ఇద్దరినీ దవాఖానకు తరలించగా, అప్పటికే మృతిచెందారని వైధ్యులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాల్పుల శబ్దాలు వినబడగానే వైట్ హౌస్ సెక్యూరిటీ సిబ్బంది లాక్‌డౌన్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని నేషనల్ గార్డ్ బలగాలు చుట్టుముట్టాయి. కాల్పుల సమయంలో ప్రెసిడెంట్ ట్రంప్ (Donald Trump) శ్వేతసౌధంలోనే ఉన్నారు.
కాగా, కాల్పుల ఘటన చోటుచేసుకున్నప్పుడు వైట్‌హౌస్ నార్త్ లాన్ (ఉత్తర మైదానం)లోసోషల్ మీడియా కోసం వీడియో రికార్డ్ చేసుకుంటున్న ఏబీసీ న్యూస్ చీఫ్ కరస్పాండెంట్ సెలీనా వాంగ్.. కాల్పుల శబ్దాలు వినబడగానే అధికారులు తమను ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లోకి పరిగెత్తమని ఆదేశించారని ఎక్స్‌లో పేర్కొన్నారు. జర్నలిస్టులందరినీ కిందకు వంగి తలలు దాచుకోవాలని హెచ్చరించారని తెలిపారు. మొత్తం 30 రౌండ్ల వరకు కాల్పుల శబ్దాలు వినిపించాయని జర్నలిస్టులు వెల్లడించారు. ప్రస్తుతం వైట్‌హౌస్ లాక్‌డౌన్‌లో ఉందని చెప్పారు.
🚨 BREAKING: SHOTS FIRED just outside the White House
Multiple reporters are saying they've heard 30 SHOTS
Press has been rushed into the press briefing room by Secret Service
White House now on lockdown.
Countersnipers on rooftop
Pray for President Trump 🙏🏻
— Nick Sortor (@nicksortor) May 23, 2026
వైట్ హౌస్‌లోనే ట్రంప్..
కాల్పులు జరుగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నారు. ఇరాన్‌తో ఒప్పందానికి సంబంధించిన చర్చల పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ట్రంప్‌కు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని, సురక్షితంగానే ఉన్నాయని వెల్లడించారు.
నెల రోజుల్లో రెండోసారి..
కాగా, వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గత నెల రోజుల్లో ఇది రెండో సారి. ఏప్రిల్ 25న వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’లో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సమయంలో టోమస్ అలెన్ అనే వ్యక్తి షాట్‌గన్‌తో సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ను దాటడానికి ప్రయత్నించి కాల్పులకు తెగబడ్డాడు. ఇప్పుడు ఏకంగా వైట్‌హౌస్ గేట్ వద్దే ఈ ఘటన జరగడం సంచలనం సృష్టించింది.
🚨BREAKING UPDATE: White House shooter is in CRITICAL CONDITION after Secret Service engagement.
No agents were injured. President Trump and staff are SAFE.
Tragically, a bystander was shot and remains in serious condition at local hospital. pic.twitter.com/8pudUuZw9N
— Commentary Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) May 23, 2026
సంబంధిత వార్తలు

Marco Rubio in India | భారత్‌పై ట్రంప్ ‘హెల్హోల్’ వ్యాఖ్యలు.. రిపోర్టర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మార్కో రూబియో!
మే 25, 2026

Bond Yields | యుద్ధం మాత్రమే కాదు.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న ప్రధాన కారణాలు ఇవే..
మే 25, 2026

Trump Brilliant Tyrant Dictator | నన్ను ‘డిక్టేటర్’ అనండి, కానీ ‘డంబ్’ అంటే ఊరుకోను: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. మెంటల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్!
మే 23, 2026
తాజావార్తలు
- ●Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా
- ●Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..
- ●RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..
- ●Lava SHARK 2 5G | రూ.11,999కే లావా షార్క్ 2 5జీ.. 6000ఎంఏహెచ్ బ్యాటరీ.. ఏఐ కెమెరా..
- ●Zaheerabad Farmers | జహీరాబాద్ రైతుల వినూత్న ప్రయత్నం.. 130 రకాల పంటలు సాగు..!

Deepak Bagla | భారతీయులు అందుకనే సీఈవోలుగా పనిచేస్తున్నారు: నీతి ఆయోగ్ మిషన్ డైరెక్టర్ దీపక్ బాగ్లా

Chhattisgarh | "రోడ్లు వేయలేకపోతే.. మాకు హెలికాప్టర్లు ఇవ్వండి".. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న లేఖ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త యాంటీ-స్కామ్ టూల్స్.. మోసాల నుంచి ఇక యూజర్లకు పూర్తి రక్షణ..

RTC Driver | వడ్లు కొనండని మంత్రికి చెప్పినందుకు ఆర్టీసీ డ్రైవర్‌ను తీసేశారు..



