Mojtaba Khamenei | మొజ్తబా ఖమేనీ ఎక్కడున్నా.. వెంటాడి మరీ అంతం చేస్తాం.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్
Mojtaba Khamenei | ఇరాన్‌కు ఐడీఎఫ్ తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. ఇరాన్ నూతన సుప్రీంలీడర్ (Iran New Supreme Leader) మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎక్కడున్నా.. వెంటాడి హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది.
International | Published On Mar 18, 2026, 3.15 pm IST
Mojtaba Khamenei | మధ్యప్రాచ్యంలో యుద్ధం 19వ రోజుకు చేరింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ జాతీయ భద్రతా మండలి (Supreme National Security Council) సెక్రటరీ, ఆ దేశ అత్యున్నత నేతల్లో ఒకరైన అలీ లారిజానీ (Ali Larijani) ఇజ్రాయెల్ అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు ఐడీఎఫ్ తాజాగా కీలక హెచ్చరికలు చేసింది. ఇరాన్ నూతన సుప్రీంలీడర్ (Iran New Supreme Leader) మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎక్కడున్నా.. వెంటాడి హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది.
ఖమేనీ సహా ఇజ్రాయెల్ దేశానికి ముప్పు కలిగించే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించింది. వెంటాడి మరీ అంతం చేస్తామని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ (Effie Defrin) స్పష్టం చేశారు. నూతన సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. "ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎక్కడున్నారన్నది ప్రస్తుతానికి మాకు తెలియదు. ఆ సమాచారం మా వద్ద లేదు. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పగలను. ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినీ వదిలిపెట్టం. వారిని వెంబడిస్తూనే ఉంటాం. మాకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరైనా మా నుంచి తప్పించుకోలేరు. మేము వారిని వెంటాడి మరీ మట్టుబెడతాం" అని డెఫ్రిన్ తీవ్రంగా హెచ్చరించారు.
ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ..
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ జాతీయ భద్రతా మండలి (Supreme National Security Council) సెక్రటరీ, ఆ దేశ అత్యున్నత నేతల్లో ఒకరైన అలీ లారిజానీ (Ali Larijani) ఇజ్రాయెల్ అంతం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది. యుద్ధం మొదటి రోజున మరణించిన సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఇరాన్ కోల్పోయిన అత్యంత కీలకమైన, సీనియర్ నాయకుడు లారిజానీనే. ఇది ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి.
తంలో అణు ఒప్పందాల సంధానకర్తగా పనిచేసిన లారిజానీ, ఇరాన్ అధికార యంత్రాంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. శుక్రవారం టెహ్రాన్‌లో జరిగిన ఖుద్స్ డే (Quds Day) ర్యాలీలో ఆయన చివరిసారిగా బహిరంగంగా కనిపించారు. అదే రోజు.. లారిజానీ సహా 10 మంది ఇరాన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ఇస్తే 10 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.83 కోట్లు) భారీ రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించడం గమనార్హం. మరోవైపు, ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో బాసిజ్ (Basij) రెసిస్టెన్స్ ఫోర్స్ చీఫ్ గులాంరెజా సులేమానీతో పాటు ఇతర సీనియర్ నాయకులను కూడా లక్ష్యంగా చేసుకుంది.
ఆ వార్తలను ఖండించిన ఇరాన్..
మరోవైపు ఇరాన్ దాడుల్లో ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన్ని రహస్యంగా రష్యాకు తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలను ఇరాన్ ఖండించింది. తమ నాయకులకు పారిపోవాలసిన అవసరం లేదని తెలిపింది. ప్రజల్లోనే ఉంటారని స్పష్టం చేసింది.
Also Read..
Iran | కాల్పుల విరమణను విశ్వసించం.. యుద్ధం ముగింపునే కోరుకుంటున్నాం : ఇరాన్
సంబంధిత వార్తలు

Iran-US tensions | అమెరికాను ఓడించేందుకు నేవీ సిద్ధంగా ఉంది : మొజ్తాబా ఖమేనీ
ఏప్రిల్ 18, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026

Iran | చేసేదేం లేక వట్టి చేతుల్తో వెళ్లిపోయారు.. జేడీ వాన్స్‌పై ఇరాన్ వ్యాఖ్యలు..
ఏప్రిల్ 12, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



