US strikes | వివాహ వేడుకపై అమెరికా క్షిపణి దాడి.. చిన్నారి సహా ఐదుగురు మృతి
US strikes | పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ప్రతిదాడులతో అమెరికా, ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైనిక స్థావరాలు, రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థపై వైమానిక దాడులు చేయగా.. గల్ఫ్ దేశాల్లో అమెరికా (America) స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.
International | Published On Sep 2, 2026, 9.16 am IST
US strikes | త్రినేత్ర.న్యూస్: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడులు ప్రతిదాడులతో అమెరికా, ఇరాన్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ (Iran) సైనిక స్థావరాలు, రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థపై వైమానిక దాడులు చేయగా.. గల్ఫ్ దేశాల్లో అమెరికా (America) స్థావరాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఇరాన్‌లోని సిరిక్‌లో జరుగుతున్న ఒక వివాహ వేడుకపై (Wedding Party) అమెరికా దళాలు దాడులు (US strikes) చేశాయి. దీంతో చిన్నారి సహా ఐదుగురు మృతిచెందారు. సుమారు 50 మంది గాయపడ్డారు.
దక్షిణ ఇరాన్‌లోని హోర్ముజ్‌గాన్ ప్రావిన్స్‌లో ఉన్న సిరిక్ (Sirik) కౌంటీలోని కుహెస్టాక్‌లో వివాహ వేడుక జరుగుతున్న ఓ ఇంటిపై అమెరికా క్షిపణి శకలాలు (Missile Attack) పడ్డాయి. దీంతో ఒక చిన్నారితో సహా నలుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. తొలుత ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించగా, అనంతరం మృతుల సంఖ్య నాలుగుకు చేరినట్లు ధృవీకరించారు. దాడి అనంతరం ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలను ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, జాస్క్, చబహార్ సహా పలు ప్రాంతాల్లో, జిరోఫ్ట్ పౌర విమానాశ్రయంలోనూ దాడులు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.
మర్చిపోలేని గుణపాతం చెబుతాం..
ఈ నేపథ్యంలో అమెరికాకు తమ బలగాలు మర్చిపోలేని గుణపాఠం చెబుతాయని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba khamenei) హెచ్చరించారు. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా ఆస్తులపై టెహ్రాన్ దాడులు పాల్పడింది. మరోవైపు అతిపెద్ద దాడి ముందుంది అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. హర్మూజ్ జలసంధిలో సముద్ర మైన్‌లను అమర్చడానికి ఇరాన్ ప్రయత్నించినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపామన్నారు. ఐఆర్‌జీసీ (IRGC) లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Telangana | తెలంగాణ భాష కేవలం ఒక్క భాష మాత్రమే కాదు.. ప్రజల జీవన విధానం కూడా
సెప్టెంబర్ 12, 2026

Trump’s New H-1B Rule | ఉద్యోగం పోతే ఇంటికే.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. ఆందోళనలో టెకీలు
సెప్టెంబర్ 11, 2026

BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



