PM Modi | రాజకీయాల్లో ముగింపు అంటూ ఉండదు : ప్రధాని మోదీ
PM Modi | రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ అనేది ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఎగువ సభ (Rajya Sabha) నుంచి 59 మంది సభ్యులు రిటైర్ అవుతున్న (retiring members) నేపథ్యంలో ఇవాళ ప్రధాని ప్రసంగించారు.
PM Modi | రాజకీయాల్లో ఫుల్‌స్టాప్ అనేది ఉండదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఎగువ సభ (Rajya Sabha) నుంచి 59 మంది సభ్యులు రిటైర్ అవుతున్న (retiring members) నేపథ్యంలో ఇవాళ ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో వారి పాత్రను కొనియాడారు. అనుభవం, వివేకం ఎంతో విలువైనవని చెప్పారు. ఎగువ సభ అనేది నిరంతరాయంగా కొనసాగే వ్యవస్థ అని తెలిపారు.
సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ఫేర్‌వెల్ లాంటి సమయాల్లో పార్టీలకు అతీతంగా పరస్పర గౌరవ భావం పెరుగుతుంది. పదవీ కాలం ముగించుకుని సభను వీడుతున్న నాయకులకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. రాజకీయాల్లో ముగింపు అనేది ఉండదు. ప్రజా సేవ అనేది కేవలం పదవీ కాలానికే పరిమితం కాదు. అది నిరంతరం కొనసాగే ప్రయాణం. రిటైర్ అయి వెళ్లిపోతున్న ఎంపీలు.. దేశం కోసం తమ విధులను నిర్వర్తిస్తూ ఉండాలి. దేశ నిర్మాణం కోసం మీ అనుభవాలు చాలా అవసరం" అని ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన సభ్యులు సీనియర్ నాయకుల నుంచి ఎంతో నేర్చుకోవాలని సూచించారు. సభలో వివిధ అంశాలపై చర్చలు జరగుతుంటాయని చెప్పారు. వాటిలో ప్రతీ సభ్యుడికి ఒక ప్రత్యేక పాత్ర ఉంటుందన్నారు.
ఖర్గే, శరద్ పవార్, దేవెగౌడపై ప్రధాని ప్రశంసలు..
రాజ్యసభలో సీనియర్ సభ్యులుగా ఉన్న మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (HD Deve Gowda), ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), ఎన్సీపీ నేత శరద్ పవార్ (Sharad Pawar)పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. వారు తమ సగం కన్నా ఎక్కువ జీవితాన్ని పార్లమెంట్ కోసం అంకితం చేశారని కొనియాడారు. ఆ ముగ్గురూ రాజకీయాల్లో మహాయోధులన్నారు. వారు సభకు హాజరవుతున్న తీరు, సమాజం పట్ల వారి అంకితభావం అసాధారణమైందన్నారు. వారి కృషి అభినందనీయమని.. కొత్తగా ఎన్నికైన ఎంపీలందరూ వారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందాలని ప్రధాని ఆకాంక్షించారు.
డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పనితీరుపై ప్రశంసలు
సభలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) పనితీరుపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆయన సభను నడిపించే తీరు అభినందనీయమన్నారు. ఆయన చాలా మృదుస్వభావి అని, కష్టపడే తత్వం ఉన్నవారని కొనియాడారు. "హరివంశ్ జీకి సుదీర్ఘకాలం పాటు సభలో బాధ్యతలు నిర్వహించే అవకాశం లభించింది. ఆయన కేవలం నైపుణ్యం కలిగిన వ్యక్తేకాదు.. కష్టపడే తత్వం ఉన్నవారు కూడా. ఆయన తన విధులను ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తున్నారు" అని ప్రధాని కొనియాడారు.
సభలో తగ్గుతున్న హాస్యం
ఒకప్పుడు సభ హాస్యానికి, వ్యంగ్యానికి వేదికగా ఉండేదన్నారు. కానీ, ప్రస్తుతం అలాంటి సందర్భాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేని (Ramdas Athawale) ప్రధాని ప్రశంసించారు. ఆయన నిజంగా ఎవర్‌గ్రీన్ అన్నారు. అథవాలే సభను వీడుతున్నారని.. ఆయన లేని లోటు కనిపిస్తుందన్నారు. ఆయన సభలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని ప్రదర్శించేవారని ప్రధాని తెలిపారు.
Also Read..
నేనెప్పుడూ అలా చెప్పలేదు.. రిటైర్మెంట్ వార్తలపై టిమ్ కుక్ క్లారిటీ
యూకేలో ప్రబలిన మెనింజైటిస్.. అప్రమత్తంగా ఉండాలని వైద్యుల హెచ్చరిక..
కేటీఆర్ వర్సెస్ మంత్రులు.. కేవలం లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






