త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US soldier arrested | మ‌దురో అరెస్ట్ గురించిన ర‌హ‌స్య స‌మాచారంతో బెట్టింగ్‌.. అమెరికా సైనికుడు అరెస్ట్‌

US soldier arrested | వెనెజువెలా (Venezuela) నేత నికోలస్ మదురో (Nicolás Maduro) నిర్బంధానికి సంబంధించిన‌ ర‌హ‌స్య స‌మాచారాన్ని ఉప‌యోగించి బెట్టింగ్‌లో లాభ‌ప‌డిన యూఎస్ సైనికుడిని అక్క‌డి పోలీసులు అరెస్ట్ (US soldier arrested) చేశారు.

D

International | Published On Apr 24, 2026, 11.34 am IST

US soldier arrested | మ‌దురో అరెస్ట్ గురించిన ర‌హ‌స్య స‌మాచారంతో బెట్టింగ్‌.. అమెరికా సైనికుడు అరెస్ట్‌
Advertisement

US soldier arrested | వెనెజువెలా (Venezuela) నేత నికోలస్ మదురో (Nicolás Maduro) నిర్బంధానికి సంబంధించిన‌ ర‌హ‌స్య స‌మాచారాన్ని ఉప‌యోగించి బెట్టింగ్‌లో లాభ‌ప‌డిన యూఎస్ సైనికుడిని అక్క‌డి పోలీసులు అరెస్ట్ (US soldier arrested) చేశారు. ఈ విష‌యాన్ని అమెరికా న్యాయ శాఖ అధికారికంగా ప్ర‌క‌టించింది. మ‌దురో నిర్బంధ స‌మాచారం అతడికి ముందే తెలుసున‌ని.. ఆ రహస్య సమాచారాన్ని అతడు తన స్వలాభం కోసం వినియోగించి రూ.3కోట్లు లాభం పొందాడ‌ని తెలిపింది. అందుకే అత‌డిపై చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

కాగా, ఈ ఏడాది జనవరిలో వెనెజువెలాపై అమెరికా సైనిక చ‌ర్య చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. మ‌దురో, అత‌డి భార్య‌ను నిర్బంధించింది. ఇందుకోసం అమెరికా గ‌తేడాది డిసెంబ‌ర్ నుంచే ఆపరేషన్ ఆబ్జల్యూట్ రిజాల్వ్ పేరుతో సీక్రెట్ మిష‌న్ ప్రారంభించింది. ఈ మిష‌న్‌లో గ్యానన్ కెన్ వాన్ డైక్ అనే సైనికుడు కూడా పాల్గొన్నాడు. ఈ ఆపరేషన్ గురించి అత‌డికి అన్ని విష‌యాలూ ముందే తెలుసు. దీంతో అత‌డు ఈ విష‌యంపై ప్రిడిక్షన్ మార్కెట్‌లో బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు.

మదురో నిర్బంధం సమాచారం బహిరంగంగా అందరికీ తెలియకముందు అతడు పందెం కాశాడు. ఈ బెట్టింగ్‌లో ఏకంగా 4 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే మ‌న భార‌త క‌రెన్సీలో రూ.3 కోట్ల‌కుపైగా గెలుచుకున్నాడు. క్రిప్టో ఆధారిత ప్లాట్‌ఫామ్ పాలిమార్కెట్‌లో అతడు మదురో నిర్బంధంపై పందెం కాశాడని అమెరికా న్యాయశాఖ అతడిపై అభియోగాలు మోపింది. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఫెడరల్ చట్టానికి విరుద్ధమని పేర్కొంది. ఈ మేర‌కు అత‌డిని అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

Also Read..

హుగ్లీ న‌దిలో ప్ర‌ధాని మోదీ ప‌డ‌వ ప్ర‌యాణం.. ఫొటోలు

ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌పై గొర్ల కాప‌ర్ల‌ దాడి..

మ‌న దేశంలో అతిపెద్ద రైల్వే స్టేష‌న్ ఏదో తెలుసా..?

Advertisement
Advertisement