త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Largest Railway Station | మ‌న దేశంలో అతిపెద్ద రైల్వే స్టేష‌న్ ఏదో తెలుసా..?

Largest Railway Station | మ‌న దేశంలో ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్ష‌న్ (Howrah Junction) దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. 23 ప్లాట్‌ఫారమ్‌లతో దేశంలోనే అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. హౌరా నగరంలోని హుగ్లీ నది ఒడ్డున (Hooghly River) ఇది ఉంది.

D

National | Published On Apr 24, 2026, 10.38 am IST

Largest Railway Station | మ‌న దేశంలో అతిపెద్ద రైల్వే స్టేష‌న్ ఏదో తెలుసా..?
Advertisement

Largest Railway Station | భారతీయ రైల్వే (Indian Railways)కు 170 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద, పురాతన రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోంది. కేవలం ప్రయాణికులను ఒకచోటు నుంచి మరో చోటుకు తరలించడానికి మాత్రమే కాకుండా.. సరుకు రవాణాకు కూడా కీల‌కంగా ఉంది. భారతీయ రైల్వే కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు దేశ సాంస్కృతిక, సామాజిక సమగ్రతకు ప్రతీకగా నిలుస్తోంది.

ఇక రైల్వే నెట్‌వ‌ర్క్ నిత్యం ల‌క్ష‌లాది మంది జీవితంలో ఓ భాగ‌మైపోయింది. త‌క్కువ ఖ‌ర్చుతో కంఫ‌ర్ట్ ప్రయాణం కావ‌డంతో చాలా మంది రైల్వేస్‌నే ఎక్కువ‌గా ప్రిఫ‌ర్ చేస్తుంటారు. సుమారు 70 వేల కిలోమీట‌ర్ల‌లో రైల్వే విస్త‌రించి ఉంది. సుమారు 7,000కుపైగా స్టేష‌న్లు ఉన్నాయి. ఇందులో కొన్ని స్టేషన్లకు వందేళ్లకు పైగా చరిత్ర ఉండగా... మరికొన్ని అత్యాధునిక సదుపాయాలతో ఇటీవలే నిర్మించినవి. మరి ప్రయాణికుల రద్దీ, ట్రాక్స్, ప్లాట్ ఫామ్స్... ఇలా వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ (Largest Railway Station) ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోనే అతిపెద్ద‌ది..

మ‌న దేశంలో ప‌శ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్ష‌న్ (Howrah Junction) దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. 23 ప్లాట్‌ఫారమ్‌లతో దేశంలోనే అత్యధిక ప్లాట్‌ఫారమ్‌లు కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. హౌరా నగరంలోని హుగ్లీ నది ఒడ్డున (Hooghly River) ఇది ఉంది. 1854లో ఈ రైల్వే స్టేష‌న్‌ను స్థాపించారు. దేశంలోనే అత్యంత పురాతనమైన, ప్రధాన టెర్మినల్స్‌లో ఒకటిగా నిలుస్తోంది. ఈ రైల్వే స్టేష‌న్ నుంచి రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ మీదుగా 600 రైళ్లు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.

23 ప్లాట్ ఫామ్స్, 25 ట్రాక్స్‌తో..

విస్తీర్ణం, ప్లాట్‌ఫారమ్‌ల సంఖ్య, రైళ్ల రాకపోకల పరంగా ఈ జంక్ష‌న్ దేశంలోనే అగ్ర‌స్థానంలో ఉంది. హౌరా రైల్వే స్టేషన్‌లో 23 ప్లాట్ ఫామ్స్, 25 ట్రాక్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ భవనం పాతదే.. అయిన‌ప్ప‌టికీ సౌకర్యాలు మాత్రం కొత్తవి. ఫ్రీ వైఫై, ఎగ్జిక్యూటివ్ లాంజ్, అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ, ఈజీగా టికెట్ పొందే కౌంటర్లు, తాగునీరు.. ఇలా ప్రయాణికుల కోసం సకల సౌకర్యాలు హౌరా రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ఈ స్టేష‌న్ తూర్పు, ఈశాన్య భార‌తాన్ని క‌లుపుతూ భార‌తీయ రైల్వే నెట్‌వ‌ర్క్‌లో ఇది కీల‌క పాత్ర పోషిస్తోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఇక్క‌డి నుంచి రైళ్లు న‌డుస్తున్నాయి.

సీల్దా, ఛ‌త్ర‌ప‌తి శివాజీ టెర్మిన‌ల్‌..

ఇక హౌరా తర్వాత కోల్‌క‌తాలోని సీల్దా రైల్వే స్టేష‌న్ భార‌త్‌లోనే రెండో అతిపెద్ద స్టేష‌న్‌గా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో 21 ప్లాట్ పార్మ్స్, 28 ట్రాక్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్ నుండి 1.5 మిలియన్స్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఈ రైల్వే స్టేషన్ కూడా అత్యంత పురాతనమైనది... 1862 నుండి ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఆ త‌ర్వాత 18 ప్లాట్‌ఫారమ్‌ల‌తో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ మూడో స్థానంలో నిలిచింది. ఇది సెంట్రల్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం. నిత్యం లక్షలాదిమంది ఈ రైల్వే స్టేషన్ గుండా రాకపోకలు సాగిస్తుంటారు. ఇది రోజుకు 6 లక్షల మందికిపైగా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అందుకే దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒక‌టిగా నిలిచింది.

Also Read..

నెల‌కు రూ.1000 సిప్ (SIP) వేస్తే రూ.15 ల‌క్ష‌లు రాబ‌డి.. మార్కెట్ ఎలా ఉన్నా లాభం ప‌క్కా..

ముత్తోజిపేటకు ఆర్టీసీ డ్రైవ‌ర్‌ శంకర్‌గౌడ్‌ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు

వాలా 2 రివ్యూ - 10 కోట్ల‌ బ‌డ్జెట్ - 200 కోట్ల క‌లెక్ష‌న్స్ - మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Advertisement
Advertisement