Donald Trump | వెనెజువెలాతో చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలా (Venezuela)తో ఓ భారీ చమురు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.
International | Published On Aug 29, 2026, 9.26 am IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలా (Venezuela)తో ఓ భారీ చమురు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందంతో ఆ దేశానికి చెందిన సుమారు 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలను అమెరికా నియంత్రణలోకి తీసుకుంటుందని వెల్లడించారు. దీనిని ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందంగా ట్రంప్ అభివర్ణించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం సాకారమైందని ట్రంప్ తెలిపారు. "ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద చమురు ఒప్పందంపై అమెరికా-వెనెజువెలా మధ్య ఇప్పుడే ఒప్పందం కుదిరింది" అని ట్రంప్ తన సోషల్ మీడియాలో చేసిన పోస్టులో తెలిపారు.
అయితే ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. ఈ ఒప్పందంపై అటు వెనెజువెలా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. వెనెజువెలాపై అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టి ఆ దేశ మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత తాజా ఒప్పంద ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read..
మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు.. కిలోపై రూ.3.89 భారం..
ఇండియా పోస్ట్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్
- ●Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..
- ●Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి
- ●Ananya Nagalla | సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో అనన్య - రష్మిక మందన్న ఊరితో లింక్?
- ●Ramchandar Rao | ఓవైసీ సోదరులకు దేశభక్తి సర్టిఫికెట్లు ఇవ్వడమంటే దేశాన్ని అవమానించడమే: రాంచందర్‌రావు

CM Revanth Reddy | నాణ్యతలో రాజీ వద్దు.. పనులు వేగవంతం చేయాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Chiranjeevi | సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న కాకా - ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టిన మెగాస్టార్

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్.. వైద్యుల హెచ్చరిక..

Raja Singh | ఒవైసీ బ్రదర్స్ చరిత్ర తెలుసుకోండి






