త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venezuela | వెనెజువెలాలో 4,000 దాటిన భూకంపం మృతులు

Venezuela | జంట భూకంపాలు (earthquake) సృష్టించిన విధ్వంసానికి వెనెజువెలా (Venezuela)లో మ‌ర‌ణించిన వారి సంఖ్య 4 వేలు దాటింది. 16,740 మంది గాయపడ్డారు. వేలాది మంది ఆచూకీ గ‌ల్లంతైంది.

D

International | Published On Jul 11, 2026, 2.20 pm IST

Venezuela | వెనెజువెలాలో 4,000 దాటిన భూకంపం మృతులు
Advertisement

Venezuela | వెనెజువెలా (Venezuela)లో గ‌త నెల సంభ‌వించిన వ‌రుస భూకంపాలు (Earthquakes) పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్ర‌కృతి విల‌యంలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 4 వేలు దాటింది (death toll passes 4000). ఈ విష‌యాన్ని అక్క‌డి ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌కంప‌న‌ల‌ ధాటికి వేల సంఖ్య‌లో గాయ‌ప‌డిన‌ట్లు వెల్ల‌డించింది.

గ‌త నెల 24న సెక‌న్ల వ్య‌వ‌ధిలో 7.2, 7.5 తీవ్ర‌త‌తో వ‌చ్చిన‌ రెండు భారీ భూకంపాలతో వెనెజువెలా వ‌ణికిపోయిన విష‌యం తెలిసిందే. వంద‌ల సంఖ్య‌లో భ‌వ‌నాలు, నివాసాలు కుప్ప‌కూలాయి. ఈ ప్ర‌కృతి ప్ర‌కోపానికి ఇప్ప‌టి వ‌ర‌కు 4,118 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. 16,740 మంది గాయపడ్డార‌ని.. వారు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. వేలాది మంది ఆచూకీ గ‌ల్లంతైంద‌ని.. వారికోసం గాలింపు కొన‌సాగుతోంద‌ని పేర్కొన్నారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

ఇదిలా ఉండ‌గా.. ప్ర‌కృతి విల‌యం మిగిల్చిన విషాదం నుంచి క్ర‌మంగా తేరుకుంటున్న వెనెజువెలాను మ‌రోసారి భూకంపం వ‌ణికించింది. శుక్ర‌వారం కార‌కాస్‌లో (Caracas) 3.0 తీవ్రతతో ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు స్థానికంగా ఉన్న భవనాలను ఖాళీ చేయించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మ‌రోవైపు ఈ భూకంపం కార‌ణంగా దాదాపు 37 బిలియన్ల డాల‌ర్ల న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఐక్యరాజ్యసమితి విపత్తు రిస్క్ తగ్గింపు కార్యాలయం (United Nations Office for Disaster Risk Reduction - UNDRR) అంచ‌నా వేసింది. భూకంప న‌ష్టాల నుంచి కోలుకోవ‌డానికి విదేశాల్లో స్తంభింప‌జేసిన ఆస్తుల‌ను విడుద‌ల చేయాల‌ని వెనెజువెలా తాత్కాలిక అధ్య‌క్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ విజ్ఞ‌ప్తి చేశారు. యూకే ఆంక్షల కింద విదేశాల్లో స్తంభింపజేసిన సుమారు 30 టన్నుల వెనెజువెలా బంగారాన్ని విడుదల చేయాలని బ్రిట‌న్ రాజు కింగ్ చార్లెస్ IIIని కోరినట్లు రోడ్రిగ్జ్ తెలిపారు.

Also Read..

భార‌త నౌకాదళంలోకి చేరిన 'మహేంద్రగిరి'.. ఇక శ‌త్రువుల‌కు ద‌డే

జులై 30 నాటికి రామ మందిరం నిర్మాణ ప‌నులు పూర్తి : నృపేంద్ర మిశ్రా

సంగారెడ్డిలో పోటీ చేయ‌న‌న్నా.. వేరే ద‌గ్గ‌ర చేయ‌న‌ని చెప్ప‌లే

Advertisement
Advertisement