త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Duscharla Satyanarayana | ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌పై గొర్ల కాప‌ర్ల‌ దాడి..

Dushcharla Satyanarayana | ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, జ‌ల‌సాధ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌కులు దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌పై (Dushcharla Satyanarayana) దాడికి పాల్ప‌డ్డారు. త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో గొర్ల‌ను మేప‌కూడ‌ద‌ని అన్నందుకు గొర్ల కాప‌ర్లు మూకుమ్మ‌డిగా ఆయ‌న‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు.

G

Telangana | Published On Apr 24, 2026, 10.52 am IST

Duscharla Satyanarayana | ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌ దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌పై గొర్ల కాప‌ర్ల‌ దాడి..
Advertisement

Duscharla Satyanarayana | త్రినేత్ర‌.న్యూస్‌: ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, జ‌ల‌సాధ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌కులు దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌పై (Duscharla Satyanarayana) దాడికి పాల్ప‌డ్డారు. త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో గొర్ల‌ను మేప‌కూడ‌ద‌ని అన్నందుకు గొర్ల కాప‌ర్లు మూకుమ్మ‌డిగా ఆయ‌న‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు. దీంతో ఆయ‌న త‌ల‌పై తీవ్రంగా గాయ‌మైంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆయ‌న‌ను సూర్యాపేట జిల్లా ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.

సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురంలో తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో గ‌త 15 ఏండ్లుగా వేలాది మొక్కలను నాటిన దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌.. దానిని అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఈ మాన‌వ నిర్మిత అడ‌విలో ప‌లువురు విద్యార్ధులు, పర్యావరణ వేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే కొద్ది కాలంగా బ‌య్య గంగ‌య్య‌, మ‌ల్ల‌య్య అనే ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డి చెట్లను నరికి బ‌ర్రెలను, గొర్లను మేపుతున్నారు.

విష‌యం తెలుసుకున్న ఆయ‌న త‌న వ్య‌వ‌సాయ క్షేత్రానికి వెళ్లారు. అక్క‌డ గొర్లను మేపుతున్న వ్య‌క్తుల‌ను అడ్డుకున్నారు. అయితే గొర్ల కాప‌ర్లు సత్యనారాయణపై కుటుంబ సభ్యులతో కలిసి కర్రలతో, మ‌ట్టి పెళ్ల‌ల‌తో దాడి చేశారు. దీంతో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. తనపై దాడి చేసిన గంగయ్య, మల్లయ్య, రోషాలు, సుమలత, యశ్వంత్, అనూషలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement