US Tariffs | భారత్‌పై 100% సుంకాలు.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ
US Tariffs | రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian oil) విషయమై భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊరటనిచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపే విషయంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకొచ్చిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ (US Senators) కీలక సవరణలు చేసింది.
International | Published On Jul 15, 2026, 10.30 am IST
US Tariffs | త్రినేత్ర.న్యూస్ : రష్యా నుంచి చమురు కొనుగోలు (Russian oil) విషయమై భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా ఊరటనిచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపే విషయంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకొచ్చిన ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ (US Senators) కీలక సవరణలు చేసింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలపై మొదట ప్రతిపాదించిన గరిష్ట 500 శాతం దిగుమతి సుంకాన్ని 100 శాతానికి తగ్గించింది. అమెరికా జాతీయ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తలుచుకుంటే ఏ దేశానికైనా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని బిల్లులో చేర్చారు.
ఈ సవరించిన బిల్లు రష్యా ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేసే చైనా, భారత్, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ దేశాలను లక్ష్యంగా చేసుకుంది. ఇక ఈ బిల్లులో కొన్ని దేశాలకు ప్రత్యేక మినహాయింపులు కూడా ప్రతిపాదించారు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉండటం, అలాగే ఆ దిగుమతులను తగ్గించేందుకు సంబంధిత దేశాలు స్పష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నిరూపించగలిగితే టారిఫ్‌ల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి.
రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంటట్‌లు ఈ బిల్లును ప్రవేశపెట్టగా.. అధ్యక్షుడు ట్రంప్ మద్దతు తెలిపారు. అయితే ఈ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం శనివారం అకస్మాత్తుగా మృతిచెందారు. ఆయన మరణానికి కొద్ది గంటల ముందే ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్ అంగీకరించారని గ్రాహం ప్రకటించడం గమనార్హం. ఇక ఈ సవరణ బిల్లుకు అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి కూడా మద్దతు లభించింది.
Also Read..
భారీ అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు.. లాభాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు..
హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు.. ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు..
రైతుల కోసం రక్తదానం అభినందనీయం.. బీఆర్ఎస్ ఎన్నారై నేత నాగరాజు గుర్రాల
సంబంధిత వార్తలు

DK Shivakumar | ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారు.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెప్టెంబర్ 15, 2026

Oracle | ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే.. లేవగానే ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పిన ఒరాకిల్
సెప్టెంబర్ 15, 2026

Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Vice President | 17న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
- ●Apple | ఐక్లౌడ్ సేవలను విస్తరించిన యాపిల్.. నెలకు రూ.75కే ప్లాన్, 50జీబీ స్టోరేజ్..
- ●SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
- ●Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?
- ●Vijay Sethupathi | తమిళనాట హీట్ పెంచిన విజయ్ సేతుపతి కామెంట్లు - సీఎం విజయ్ పాలనపై కౌంటర్ అంటోన్న నెటిజన్లు
- ●Wife Drugging Rape Case | భార్యకు తెలియకుండా 20 ఏళ్లుగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన భర్త

Vice President | 17న హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

Apple | ఐక్లౌడ్ సేవలను విస్తరించిన యాపిల్.. నెలకు రూ.75కే ప్లాన్, 50జీబీ స్టోరేజ్..

SpiceJet | స్పైస్‌జెట్ చోర్ హై.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Errolla Srinivas | కుంభం అనిల్ రెడ్డి, ఆంక్షా రెడ్డి, బీర్ల ఐలయ్య ఎస్సీలా?



