త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్ర‌తినిధిపై ఇజ్రాయెల్ రాయ‌బారి ఫైర్‌

UN Meeting | ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో (UN Meeting) ర‌సాభాస నెల‌కొంది. ఇజ్రాయెల్ రాయ‌బారి (Israeli envoy) డాని డానోన్ (Danny Danon), యూఎన్ అధికారి వ‌న్నెసా ఫ్రేజ‌ర్ (Vanessa Frazier) మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుంది. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు తీవ్రంగా నోరు పారేసుకున్నారు.

D

International | Published On Jun 20, 2026, 11.30 am IST

UN Meeting | నోరు మూస్తారా.. యూఎన్ ప్ర‌తినిధిపై ఇజ్రాయెల్ రాయ‌బారి ఫైర్‌
Advertisement

UN Meeting | ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల్లో (UN Meeting) ర‌సాభాస నెల‌కొంది. యుద్ధ రంగాల్లో లైంగిక హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం (International Day for the Elimination of Sexual Violence in Conflict) సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో ఇజ్రాయెల్ రాయ‌బారి (Israeli envoy) డాని డానోన్ (Danny Danon), యూఎన్ అధికారి వ‌న్నెసా ఫ్రేజ‌ర్ (Vanessa Frazier) మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుంది. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు తీవ్రంగా నోరు పారేసుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర స్థాయిలో మాట‌ల యుద్ధం సాగింది. ఈ క్ర‌మంలో "మీరు కాస్త నోరు మూసుకుంటారా" అంటూ ఫ్రేజ‌ర్‌ని ఉద్దేశించి డానోన్ అన‌డంతో అక్క‌డ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది.

ఇజ్రాయెల్‌లో లైంగిక హింస ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌ని, ఆ దేశాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాల‌ని ఐరాస ప్రతినిధి ప్రమీలా పాటెన్ త‌న రిపోర్టులో పేర్కొన్నారు. ఆ నివేదిక‌ను ఇజ్రాయెల్ తీవ్రంగా త‌ప్పుప‌ట్టింది. చ‌ర్చ సందర్భంగా మాట్లాడిన ఇజ్రాయెల్ రాయబారి డానీ డానోన్.. పాటెన్ పక్షపాతంతో వ్యవహరించారని, ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ పైనా విమర్శలు గుప్పించారు. వెంట‌నే జోక్యం చేసుకున్న యూఎన్ అధికారి ఫ్రేజ‌ర్.. డానోన్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'పాయింట్ ఆఫ్ ఆర్డర్' అంటూ గట్టిగా అరుస్తూ.. వ్యక్తిగత దాడులకు దిగకూడదని డిమాండ్ చేశారు. అలాగే ఇజ్రాయెల్‌లో జ‌రుగుతున్న లైంగిక హింసాత్మ‌క ఘ‌ట‌న గురించి తమవద్ద సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.

దీంతో ఆగ్ర‌హానికి గురైన డానోన్‌.. నోరు మూసుకోవాలి అంటూ ఫ్రేజ‌ర్‌పై ఫైర్ అయ్యారు. "ఇజ్రాయెల్ ఐరాస‌లో స‌భ్య దేశం. మీరు యూఎన్‌లో ప‌నిచేస్తున్నారు. కాబ‌ట్టి ఇప్పుడు మీరు నోరు మూసుకోవాలి. నోరు మూస్తారా లేదా" అంటూ తీవ్ర స్వ‌రంతో అన్నారు. మీరు ఈ ప‌ద‌విని ఎందుకు తీసుకున్నారో త‌మ‌కు తెలుసున‌ని, ఇజ్రాయెల్‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతోన్న ప్ర‌చారంలో మిమ్మ‌ల్ని భాగం కానివ్వ‌బోం అంటూ ఫ్రేజ‌ర్‌ను ఉద్దేశించిన డానోన్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. పాల‌స్తీనా పిల్ల‌ల ప‌ట్ల వేధింపులు జ‌రుగుతున్న‌ట్లు ఇజ్రాయెల్‌కు వ్య‌తిరేకంగా గుటెర్రస్ త‌ర‌ఫున యూఎన్‌లో ఫ్రేజ‌ర్ రిపోర్టు ప్ర‌వేశ‌పెట్టిన నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

Also Read..

నీట్ రీ-ఎగ్జామ్‌.. ప‌రీక్ష‌కు అర గంట ముందే గేట్లు బంద్‌

రేపే నీట్ రీ ఎగ్జామ్‌.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంట‌ర్‌.. ఎన్‌టీఏ ఏమ‌న్న‌దంటే..?

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో భారీగా తగ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. కార‌ణ‌మేంటి..?

Advertisement
Advertisement