NEET Re Test | రేపే నీట్ రీ ఎగ్జామ్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.. ఎన్‌టీఏ ఏమన్నదంటే..?
NEET Re Test | నీట్ రీ టెస్ట్‌కు మరికొన్ని గంటలే సమయం ఉన్న వేళ ఓ విద్యార్థికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రేపు జరగబోయే ఎగ్జామ్‌కు విదేశాల్లో ఎగ్జామ్ సెంటర్ కేటాయించడం షాక్‌కు గురి చేస్తోంది. నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం (Abu Dhabi centre) కేటాయించారు. అది చూసిన సదరు విద్యార్థి, అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది.
NEET Re Test | నీట్ యూజీ 2026 పరీక్ష వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పేపర్ లీకేజీలతో మే 3న జరిగిన పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసిన విషయం తెలిసిందే. రేపు మళ్లీ రీ ఎగ్జామ్ (NEET re-exam) నిర్వహించనుంది. ఇప్పటికే పేపర్ లీకేజీ, రీటెస్ట్, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో లోపాలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న అభ్యర్థులకు ఇప్పుడు ఓ కొత్త తలనొప్పి మొదలైంది.
రేపు జరగబోయే నీట్ రీ టెస్ట్ ఎగ్జామ్‌కు సంబంధించి ఓ విద్యార్థికి (Nagpur student) ఏకంగా యూఏఈలో ఎగ్జామ్ సెంటర్ పడటం షాక్‌కు గురి చేస్తోంది. నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా అనే విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం (Abu Dhabi centre) కేటాయించారు. అది చూసిన సదరు విద్యార్థి, అతడి కుటుంబం ఒక్కసారిగా షాక్ అయ్యింది. దరఖాస్తును సమర్పించేముందు తాము నాగ్‌పూర్ లేదా పరిసర ప్రాంతాల్లోని కేంద్రాలను జాగ్రత్తగా ఎంచుకున్నట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. అయితే, విదేశంలో ఎగ్జామ్ సెంటర్ ఎలా వచ్చిందో తమకు అర్థం కావడం లేదన్నారు. అంతేకాదు, తనకు పాస్‌పోర్ట్ కూడా లేదని ఇప్పటికిప్పుడు వీసా, పాస్‌పోర్ట్ సాధించడం ఎలా సాధ్యమవుతుందని సదరు విద్యార్థి వాపోయాడు.
ఎన్‌టీఏ ఏమన్నదంటే..?
దీనిపై బాధిత విద్యార్థి ఫ్యామిలీ వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. అప్రమత్తమైన ఏజెన్సీ సాంకేతిక లోపం కారణంగా ఇలా వచ్చిందని తప్పును సరిదిద్దుతామని హామీ ఇచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన చర్చల అనంతరం ఆ విద్యార్థికి నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకంతా సవరించిన అడ్మిట్ కార్డును జారీ చేస్తామని హామీ ఇచ్చింది.
వ్యవస్థను ఎగతాళిగా మార్చేశారు..
ఈ ఘటనపై మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ అనీస్ అహ్మద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌టీఏ పరీక్షా ప్రక్రియను ఎగతాళిగా మార్చేసిందంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఈ వ్యవహారంతో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఎన్‌టీఏ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎందుర్కొంటున్న తరుణంలో.. తాజా ఘటన వ్యవస్థల పనితీరుపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
Also Read..
వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్‌లైన్‌లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..
ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు
తాజావార్తలు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్‌లైన్‌లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..
- ●PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..
- ●N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు
- ●FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం
- ●Bank Holidays | వరుసగా మూడు రోజులు.. మూతపడనున్న బ్యాంకులు
- ●Morocco Vs Scotland | సూపర్ సైబరీ.. మొరాకో విక్టరీ

WhatsApp | వాట్సాప్‌లో కొత్త గ్రీన్ డాట్.. ఆన్‌లైన్‌లో ఉన్నవారిని వెంటనే గుర్తించొచ్చు..

PhonePe | ఫోన్‌పే యూజర్లకు షాక్.. వాలెట్ వాడకపోతే రూ.100 చార్జీలు కట్టాల్సిందే..

N Ramchander Rao | ప్రపంచానికి భారత్ అందించిన నాగరికతా బహుమతి యోగా: రామచందర్ రావు

FIFA WC 2026 | నేవెస్ కామెంట్స్‌తో రాజుకున్న వివాదం.. సోషల్ మీడియాలో రొనాల్డో అభిమానుల ఆగ్రహం






