Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
Strait of Hormuz | ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వాణిజ్య నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణి దాడి చేసింది.
International | Published On Jul 7, 2026, 11.17 am IST
Strait of Hormuz | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై (commercial ships) ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనలో నౌకలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) క్షిపణి దాడి చేసింది. ఐఆర్‌జీసీ దాడిలో కనీసం రెండు నౌకలు దెబ్బతిన్నాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అమెరికా అధికారిని ఉటంకిస్తూ యాక్సియోస్ (Axios) నివేదించింది.
మరోవైపు మంగళవారం తెల్లవారుజామున హార్ముజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో (coast of Oman) ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్‌పైకి క్షిపణి దూసుకురావడంతో అందులో మంటలు చెలరేగినట్లు బ్రిటీష్ సైన్యం తెలిపింది. ఇది కూడా ఇరాన్‌పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కీలక జలమార్గంలో నౌకలపై దాడులను నిలిపివేసేలా అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవలే ఒక అవగాహన ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






