Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Vemula Prashanth Reddy | ప్రాణహిత నది (Pranahitha River) కలిసిన దగ్గర నుంచి గోదారమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నదని, ఆ పైన గోదావరి నదిలో (Godavari River) చుక్క నీళ్లు కూడా లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) గేట్లు మూయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepally Pump House) నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Vemula Prashanth Reddy | త్రినేత్ర.న్యూస్: ప్రాణహిత నది (Pranahitha River) కలిసిన దగ్గర నుంచి గోదారమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్నదని, ఆ పైన గోదావరి నదిలో (Godavari River) చుక్క నీళ్లు కూడా లేదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) గేట్లు మూయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepally Pump House) నుంచి నీళ్లు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎగువ గోదావరి ఆయకట్టు రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం మొండిపట్టు వీడి.. కన్నెపల్లి నుంచి నీటిని పంపు చేయాలని డిమాండ్ చేశారు. వర్షమే వస్తలేదు, నీళ్లే వస్తలేవంటే వరద ఎక్కడి నుంచి వచ్చిందని, వరదొస్తే వడిసి పట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, నీళ్లు ఎత్తిపోసేంది ఏందంటూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ మేడిగడ్డవైపు ఉరకలెత్తుతున్న గోదావరి నదీ ప్రవాహాన్ని చూపించారు. కన్నపెల్లి పంప్‌హౌస్ గేట్ల వద్దకు నీరు చేరడాన్ని వీడియో ద్వారా చూపించారు. ఆ నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉందని వివరించారు.
`ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత పారుతున్న గోదావరి. ఇప్పుడు మనం కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఉన్నం. కొద్దిగ కిందికి మేడిగడ్డ బ్యారేజి ఉన్నది. మేడిగడ్డ తెరచి ఉంది. గోదావారి పారుతాఉన్నది. బ్యారేజీ నిలకగా అలాగే ఉంది. ఏం కాలేదు. గోదావరి నీళ్లు బ్యారేజీని దాటుకుని కిందికి పోతున్నయి. పారే గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ నీళ్లు వస్తాయి. గోదావరిలో 92 మీటర్ల ఎత్తు నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్‌కి నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు 102 మీటర్ల ఎత్తులో ప్రవాహం ఉంది. అంటే 10 మీటర్ల ఎత్తులో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు కన్నెపల్లి పంప్‌హౌస్‌లోకి రావచ్చు. మేడిగడ్డ బ్యారేజీని మూసివేయకున్నా.. పారే గోదావరి నుంచే 10 మీటర్ల మేర నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. పంప్‌హౌస్‌కు ఉన్న 32 గేట్లు తెరిస్తే ఆ నీళ్లను పైకి ఎత్తి పోయవచ్చు.
రామగుండం (Ramagundam) వద్ద మేము బ్రిడ్జిని దాటేటప్పుడు అక్కడ గోదావరిలో (Godavari) చుక్క నీళ్లు లేవు. ఎక్కడైతే ప్రాణహిత కలిసిందో అక్కడి నుంచి గోదావారి బ్రహ్మాండగా పారుతున్నది. అంటే ఇక్కడి నుంచి ఎగువన ఉన్న గోదావరిలో నీళ్లు లేవు. ఆ గోదావరిపై ఆధారపడిన ఆయకట్టు రైతులు ఇబ్బందుల్లో ఉన్నరు. రామగుండం నుంచి పైకి గోదావరంతా నీళ్లు లేకుండా ఉన్నది. శ్రీరాంసాగర్‌లో (Sriram Sagar) కూడా నీళ్లు లేవు. ఇప్పుడు 25 టీఎంసీలకు వచ్చింది. మొత్తం 90 టీఎంసీల సామర్థ్యానికి. ఎల్ఎండీలో (LMD) కూడా 5 టీఎంసీల నీళ్లు ఉన్నయి. మిడ్‌మానేరులో (MMD) కూడా చుక్క నీరు లేదు. అక్కడ 5 టీఎంసీల నీరే ఉంది. ఆపైన ఉన్న మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ కావచ్చు దేనీలో కూడా నీళ్లు లేవు. ఆ ఆయకట్టు దారులంతా నీరిక్షిస్తున్నరు. లోటు వర్షపాతం ఉన్నది.
బోర్లమీద ఆధారపడి నాట్లు వేశారు. ఇప్పుడు ఆ బోర్లు నడుస్తయా, నడువవా అనే భయంతో ఉన్నారు. కాబట్టి కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి ఎగువ గోదావరి మీద ఆధారపడిన ప్రతి.. ఎల్లంపల్లికి పంపించి.. అక్కడ నుంచి వరద కాలువలో వేసి.. అటునుంచి ఎంఎండీకి పంపించి.. వరద కాలువ నింపి, దాని నుంచి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ (Mallanna Sagar), కొండపోచమ్మసాగరును నింపుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 140 టీఎంసీలు నింపుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా మొండిపట్టు వీడాలి. మా మీద ఉన్న కోసం రైతులను శిక్షించకూడదు. నీళ్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నయి. కాబట్టి ఈ నీళ్లను వెంటనే ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం` అంటూ ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
కేసీఆర్ గారి మీద కోపంతో రైతులను ఆగం చేయడం సరికాదు
వైరల్ అవుతున్న ప్రశాంత్ రెడ్డి వీడియో
కన్నెపల్లి పంప్ హౌస్‌లో 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది, కానీ ఇప్పుడు 102 మీటర్ల వద్ద నీళ్లు ఉన్నాయి
గోదావరిలో నీళ్లు లేకపోయినా, ప్రాణహిత నది కలిసే చోట తీవ్ర వరద… https://t.co/IZUYXTl77Y pic.twitter.com/iPmk4zSMi4
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






