Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
Moto G77 Power | మొబైల్స్ తయారీ సంస్థ మోటోరోలా భారత్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ మోటో జి77 పవర్‌ను బుధవారం విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీ, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్‌ఫుల్ కెమెరాలు వంటి ఫీచర్లను అందించారు. మోటో జి77 పవర్ ఫోన్‌లో 6.72 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు.
Technology | Published On Jul 8, 2026, 1.11 pm IST
Moto G77 Power | మొబైల్స్ తయారీ సంస్థ మోటోరోలా భారత్‌లో తన నూతన స్మార్ట్ ఫోన్ మోటో జి77 పవర్‌ను బుధవారం విడుదల చేసింది. ఇందులో భారీ బ్యాటరీ, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, శక్తివంతమైన ప్రాసెసర్, పవర్‌ఫుల్ కెమెరాలు వంటి ఫీచర్లను అందించారు. మోటో జి77 పవర్ ఫోన్‌లో 6.72 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. దీనికి ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు కనుక డిస్‌ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా డిస్‌ప్లేకు 1050 నిట్స్ అధిక బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ ర్యామ్ ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 16జీబీ వరకు పెంచుకోవచ్చు. దీంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. ల్యాగ్ ఉండదు. 128జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే అవకాశం కల్పించారు.
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ..
వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీనికి క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా ఇచ్చారు. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 2కె వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ ఇస్తాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా పనిచేస్తుంది. దీనికి ఆండ్రాయిడ్ 17 వరకు ఒక ఓఎస్ అప్‌డేట్ తో పాటు మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ తెలిపింది. డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ ను అందించారు. అలాగే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను ఇచ్చారు. 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎం రేడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, డ్యూయల్ మైక్రోఫోన్లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5జి, **డ్యూయల్ 4జి వోల్టీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి వంటి ఫీచర్లను అందించారు.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 7000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని చెప్పవచ్చు. దీనికి 30 వాట్ టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు, 6 వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మోటో జి77 పవర్ ఫోన్‌ను పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఫ్యూషియా రెడ్ రంగుల్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.25,999గా నిర్ణయించారు. సింగిల్ వేరియెంట్‌లోనే ప్రస్తుతం ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ను ఫ్లిప్‌కార్ట్ తోపాటు మోటోరోలా ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. లాంచ్ ఆఫర్లలో భాగంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్‌పై రూ.2వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
సంబంధిత వార్తలు

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
ఆగస్టు 8, 2026

HP OmniPad 12 | విద్యార్థులు, ఉద్యోగులకు హెచ్‌పీ ప్రత్యేక ట్యాబ్.. ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్..
ఆగస్టు 7, 2026

Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ



