woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
woman delivers 4 babies | ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే డెలివరీ అయ్యింది. మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది (woman delivers 4 babies). దురదృష్టవశాత్తూ పసికందులు పుట్టిన కాసేపటికే మరణించారు.
woman delivers 4 babies | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) విషాదం చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే డెలివరీ అయ్యింది. మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది (woman delivers 4 babies). అయితే, కాసేపటికే పసికందులు మరణించారు. తల్లిమాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ విషాధ ఘటన మాండ్లా (Mandla city) జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నైగాన్వా గ్రామానికి (Naiganwa village) చెందిన 28 ఏళ్ల రజనీ సింద్రామ్‌కు నెలలు నిండకుండానే పురుటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే, సకాలంలో సాయం అందలేదు. ఇటు చూస్తూ రజనీ పరిస్థితి విషమిస్తోంది. కుటుంబ సభ్యులు వేరే మార్గం లేక ఆమెను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయల్దేరారు. ఓ ఆశా కార్యకర్త సహాయంతో ఘుటాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు రజనీకి ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం బిచియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రిఫర్ చేశారు.
వైద్యుల సూచనల మేరకు ఆ కుటుంబం ఆటోలోనే బిచియా బయల్దేరింది. మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువై రజనీకి డెలివరీ అయ్యింది. ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ పిల్లలు కాసేపటికే మరణించారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, బిచియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
అత్యవసర సేవల విభాగం సకాలంలో స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని బాధిత కుటుంబం ఆరోపించింది. అంబులెన్స్ సమయానికి వచ్చి ఉంటే పిల్లలు బతికేవారని వాపోయారు. వైద్య సహాయం ఆలస్యం వల్లే పిల్లల్ని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. బాధిత కుటుంబం ఆరోపణలను జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో శిశువులు మరణించారని చెబుతున్నారు.
Also Read..
11 ఏళ్ల బాలికపై హత్యాచారం.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






