Meta | మెటాలో 16వేల ఉద్యోగాలకు కోత..? ఏఐ ప్రభావమేనా..?
Meta | మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ఖర్చులను తగ్గించుకోవడం, ఏఐ సహాయంతో పని చేసే ఉద్యోగుల కారణంగా సంస్థలో సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.
Meta | మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. కృత్రిమ మేధస్సు మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల వచ్చే ఖర్చులను తగ్గించుకోవడం, ఏఐ సహాయంతో పని చేసే ఉద్యోగుల కారణంగా సంస్థలో సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఈ ప్రణాళికలు అమలులోకి వస్తే కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మందిపై ప్రభావం పడవచ్చని పేర్కొంది. అయితే ఈ ఉద్యోగాల కోత ఎప్పుడు అమలులోకి వస్తుందో ఇంకా నిర్ణయించలేదని, కోతల పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాయిటర్స్‌కు సమాచారం ఇచ్చిన వర్గాలు తెలిపాయి.
16వేల మంది ఉద్యోగులపై ప్రభావం..
మెటా సంస్థలోని అగ్రశ్రేణి ఉద్యోగులు ఇటీవల ఇతర సీనియర్ ఉద్యోగులతో ఈ ప్రణాళికల గురించి చర్చించినట్లు సమాచారం. సంస్థలో ఉద్యోగాల సంఖ్యను ఎలా తగ్గించాలనే దానిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రశ్నలు ఎదుర్కొన్నప్పుడు మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. ఇది కేవలం సిద్ధాంతపరమైన విధానాలపై ఆధారపడిన ఊహాగానాల నివేదిక మాత్రమే.. అని తెలిపారు. మెటా సంస్థ తాజా ఫైలింగ్ ప్రకారం 2025 డిసెంబర్ 31 నాటికి కంపెనీలో దాదాపు 79వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగాల్లో 20 శాతం కోత విధిస్తే దాదాపు 16వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఇది ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీగా పిలిచిన 2022-2023 సంవత్సరం తర్వాత మెటా సంస్థలో అతిపెద్ద ఉద్యోగాల కోతగా నిలవనుంది.
2022లోనూ భారీగానే..
మెటా 2022 నవంబరులో సుమారు 11వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో ఇది కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతం కాగా అదే సంవత్సరం నాలుగు నెలల తర్వాత మరోసారి 10వేల ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. గతేడాది నుంచి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ సంస్థను జనరేటివ్ ఏఐ రంగంలో మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆలోచిస్తున్నారు. కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ బృందం కోసం ప్రముఖ ఏఐ పరిశోధకులను ఆకర్షించేందుకు కంపెనీ భారీ వేతన ప్యాకేజీలను ప్రకటించింది. వాటిలో కొన్ని నాలుగు సంవత్సరాల కాలంలో వందల మిలియన్ల డాలర్ల విలువైనవి కూడా ఉన్నట్లు సమాచారం.
ఏఐపై మెటా భారీ పెట్టుబడులు..
డేటా సెంటర్ల నిర్మాణానికి 2028 నాటికి 600 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ ప్రణాళికలు రూపొందించినట్లు కూడా మెటా తెలిపింది. ఇటీవలే మెటా సంస్థ మోల్ట్‌బుక్ అనే ఏఐ ఏజెంట్ల కోసం రూపొందించిన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను కొనుగోలు చేసింది. అలాగే చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ మానస్ ను కొనుగోలు చేయడానికి కనీసం 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ పెట్టుబడుల వల్ల సంస్థలో సామర్థ్యం పెరుగుతుందని జుకర్‌బర్గ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. జనవరిలో మాట్లాడుతూ ఇప్పటివరకు పెద్ద బృందాలు అవసరమైన ప్రాజెక్టులను ఇప్పుడు ఒక్క ప్రతిభావంతుడైన వ్యక్తి కూడా పూర్తి చేయగలుగుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆయన చెప్పారు.
సంబంధిత వార్తలు

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
జులై 8, 2026

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో
జులై 7, 2026

Preity Zinta | డీప్‌ఫేక్ కంటెంట్‌పై హైకోర్టును ఆశ్రయించిన ప్రీతి జింతా.. వెబ్సైట్లకు మార్గదర్శకాలపై కోర్టు ఆదేశాలు
జులై 3, 2026
తాజావార్తలు
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం



