Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
Congress | సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. తుంగతుర్తి నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. సొంతపార్టీ నేతలే (Congress Supporters) ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.
Congress | త్రినేత్ర.న్యూస్: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. తుంగతుర్తి నియోజకర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వర్గపోరు తీవ్రమైంది. సొంతపార్టీ నేతలే (Congress Supporters) ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అర్వపల్లి (Arvapally) మండల కేంద్రంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు వర్గాల కొట్టుకున్నాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థులు నెలకొనడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.
తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే మందుల సామేలు (MLA Mandula Samuel) ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) వర్గానికి చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరికి నిరసనగా, ఆ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్‌కు (Gandhi Bhavan) బయల్దేరారు. ఈ క్రమంలో అర్వపల్లి మండల కేంద్రంలో వారిని ఎమ్మెల్యే సామేలు అనుచరులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఒకరినొకరు తోసుకున్నారు.
సూర్యాపేట కాంగ్రెస్‌లో రచ్చ.. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులు
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు
జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
ఎమ్మెల్యే మందుల సామేల్ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ఛలో గాంధీభవన్‌కు ప్రత్యర్థి వర్గం
గాంధీభవన్‌కు వెళ్తున్న పాత… pic.twitter.com/Tc3MmeeqaP
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 8, 2026
అది మరింత ముదరడంతో ఇరుపక్షాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుఉకన్నారు. దీంతో ప్రధాన రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకున్నది. దాడులు ప్రతిదాడుల్తో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు తమ లాఠీలకు (Lathi Charge) పనిచెప్పారు. రెండు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో ఉద్రిక్తత
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంపై కర్రలతో, రాళ్లతో దాడి చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు
పలు వాహనాలు ధ్వంసం చేసిన ఇరు వర్గాల కాంగ్రెస్ నాయకులు
పలువురు… https://t.co/kGhLnaGYzm pic.twitter.com/EFoOlpfFzg
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ






