Dowry Free Marriage | కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు.. కోలం ఆదివాసి తెగ తీర్మానం
Dowry Free Marriage | పెండ్లి అనగానే వధూ వరుల గురించి కాకుండా కట్నం (Dowry) ఎంత అనే ప్రశ్న మనకూ తరచూ వినిపిస్తుంది. కట్న కానుకలు ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పగా భావిస్తుంటారు. కొందరు వరకట్నం (Dowry Free Marriage) కోసం కట్టుకున్న భార్యను నానా చిత్రహింసలు పెడుతుంటారు.
Dowry Free Marriage | త్రినేత్ర.న్యూస్: పెండ్లి అనగానే వధూ వరుల గురించి కాకుండా కట్నం (Dowry) ఎంత అనే ప్రశ్న మనకూ తరచూ వినిపిస్తుంది. కట్న కానుకలు ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పగా భావిస్తుంటారు. కొందరు వరకట్నం (Dowry Free Marriage) కోసం కట్టుకున్న భార్యను నానా చిత్రహింసలు పెడుతుంటారు. మరికొందరైతే హత్యలకూ వెనుకాడరు. ఇలాంటివన్నీ తమకెందుకు అనుకున్నారో ఏమో.. కట్నకానుకలపై ఓ గిరిజన తెగ నిషేధం విధించింది. కట్నం ఇవ్వొద్దు.. తీసుకొద్దని కట్టుబాటు చేసింది. వరకట్నం తీసుకోవద్దు వధువు కుటుంబంపై ఆర్థిక భారం వేయొద్దని ప్రత్యేక తీర్మానం చేసింది.
ప్రస్తుతం పెండ్లి అంటే ఓ స్టేటస్ సింబల్ అయిపోయింది. తమగురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలంటూ ఎంత ఖర్చుకైనా వెనకాడుతలేరు. దీంతో వివాహ వేడుక పేద, మధ్యతరగతి కుటుంబాలకు అగ్ని పరీక్షగా మారింది. ఆడపిల్లల తల్లితండ్రులు పెండ్లి అంటే భయపడేలా తయారైంది పరిస్థితి. ఈనేపథ్యంలో వరకట్నం తీసుకోవద్దు వధువు కుటులుంబాలపై ఆర్థికభారం పడనీయవద్దు అంటూ తొమ్మిది అంశాలతో ఆదిలాబాద్ (Adilabad) జిల్లా సాత్నాల మండలం టెంర్రీగూడెంలో సమావేశమైన కొలాం గిరిజన తెగ తీర్మానం చేసింది.

పెండ్లి, నిశ్ఛితార్థం అంటూ ఆడంబరాలకు వెళ్లి అనవసర ఖర్చులు చేయకుండా కొంతమంది సమక్షంలోనే వివాహ తంతును పూర్తి చేయాలని నిర్ణయించారు. పెండ్లికి ఖరీదైన రెడీమెడ్ మండపం వేయకుండా.. పచ్చనిపందిరి వేసి సంప్రదాయరీతిలో చేసుకోవాలని తీర్మానించారు. బంధువులు వధూవరులకు బహుమతిగా డబ్బులే ఇవ్వాలని సూచించారు. ఈ తీర్మానానికి జైనథ్, సాత్నాల, బేల, ఆదిలాబాద్ గ్రామీణ మండలాలకు చెందిన కొలాం తెగ పెద్దలు అంగీకరించారు.
సంబంధిత వార్తలు

Khandala | తెలంగాణ కశ్మీర్.. చుట్టూ కొండలు.. గుట్టలు.. జాలువారే సెలయేర్లు
ఆగస్టు 3, 2026

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
జులై 27, 2026

Saptha Gundala Waterfalls | జాలువారుతున్న సప్తగుండాల జలపాతం.. ప్రకృతి ప్రేమికుల గుండెల్లో జలసవ్వడి
జులై 21, 2026
తాజావార్తలు
- ●VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే
- ●Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి
- ●Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..
- ●NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు
- ●Horoscope | ఆగస్టు 20 రాశిఫలాలు.. గురుడి ప్రభావంతో వారికి శుభ ఖర్చులు ఉంటాయి!
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

VD Savarkar | క్విజ్‌లో సావర్కర్‌పై ప్రశ్న.. ఉపాధ్యాయుడి సస్పెన్షన్.. హైకోర్టు స్టే

Dubbaka | బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు పిల్లలు సహా దంపతులు మృతి

Revanth Reddy | నేటి నుంచి సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. 30న రాష్ట్రానికి..

NEET UG | 21న నీట్ యూజీ తొలి విడత సీట్ల కేటాయింపు



