WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
WhatsApp | వాట్సాప్ తన మూడో వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో ముంబై వేదికగా మెటా బిజినెస్ ఏజెంట్ ను అధికారికంగా ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా రూపొందించిన ఈ కొత్త ఫీచర్ వ్యాపార సంస్థలు కస్టమర్‌లతో జరిగే సంభాషణలను సమర్థవంతంగా నిర్వహించడం, ఆటోమేటిక్‌గా స్పందించడం, అలాగే రోజుకు 24 గంటల పాటు పలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడంలో సహాయపడుతుంది.
Technology | Published On Jul 8, 2026, 12.43 pm IST
WhatsApp | వాట్సాప్ తన మూడో వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో ముంబై వేదికగా మెటా బిజినెస్ ఏజెంట్ ను అధికారికంగా ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా రూపొందించిన ఈ కొత్త ఫీచర్ వ్యాపార సంస్థలు కస్టమర్‌లతో జరిగే సంభాషణలను సమర్థవంతంగా నిర్వహించడం, ఆటోమేటిక్‌గా స్పందించడం, అలాగే రోజుకు 24 గంటల పాటు పలు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడంలో సహాయపడుతుంది. మెటా బిజినెస్ ఏజెంట్ కస్టమర్‌తో మొదటి సంభాషణ నుంచే సేవలను అందిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, బిజినెస్ క్యాటలాగ్‌లోని ఉత్పత్తులను సిఫార్సు చేయడం, అపాయింట్‌మెంట్‌లను బుక్ చేయడం, వచ్చే లీడ్‌లను అర్హత ఆధారంగా వర్గీకరించడం, అలాగే అమ్మకాలు పూర్తయ్యే వరకు సహకరించడం వంటి పనులను ఈ ఏఐ ఏజెంట్ నిర్వహిస్తుంది. అవసరమైన సందర్భాల్లో మానవ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన సమయాన్ని కూడా వ్యాపార సంస్థలు ముందుగానే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
సులభంగా ట్రాకింగ్..
కస్టమర్‌లతో జరిగిన సంభాషణల ఆధారంగా ఈ ఏఐ ఏజెంట్ విలువైన విశ్లేషణలను అందించడంతోపాటు, మిస్ అయిన చాట్‌లకు సంబంధించిన సంక్షిప్త వివరాలను కూడా అందిస్తుంది. దీంతో సంస్థలు కస్టమర్ సంభాషణలను సులభంగా ట్రాక్ చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలపై వేగంగా ఫాలోఅప్ చేయగలుగుతాయి. పెద్ద సంస్థల కోసం వాట్సాప్ మెటా బిజినెస్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. భారీ స్థాయిలో ఏఐ ఏజెంట్‌లను రూపొందించడం, పర్సనలైజ్ చేయడం, అమలు చేయడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఈ ప్లాట్‌ఫామ్ అందిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఏజెంట్‌లను రూపొందించడంతోపాటు ఇప్పటికే ఉపయోగిస్తున్న వ్యాపార వ్యవస్థలతో అనుసంధానం చేసుకోవచ్చు. ముఖ్యంగా షాపిఫై, జెండెస్క్, షోపీ వంటి ప్లాట్‌ఫామ్‌లతో ఇది అనుసంధానమవుతుంది. అలాగే వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేస్తూ భారీ స్థాయిలో సేవలను నిర్వహించడానికి అవసరమైన నియంత్రణలు, పనితీరు కొలిచే సాధనాలను కూడా అందిస్తుంది.
త్వరలో వాట్సాప్ సెర్చ్..
స్విగ్గీ, మధులిక ఎంటర్‌ప్రైజెస్, కైజెన్ అడ్వెంచర్స్ వంటి సంస్థలు ఇప్పటికే మెటా బిజినెస్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్న తొలి సంస్థలుగా వాట్సాప్ వెల్లడించింది. ఈ సంస్థలు కస్టమర్ సేవల కోసం ఏఐ ఏజెంట్‌లను వినియోగిస్తున్నట్లు తెలిపింది. వ్యాపార సంస్థలను గుర్తించడం కూడా వినియోగదారులకు మరింత సులభం కానుంది. త్వరలో వాట్సాప్ సెర్చ్‌లోనే వ్యాపార సంస్థల పేరుతో నేరుగా శోధించే సదుపాయం అందుబాటులోకి రానుంది. అలాగే వ్యాపార కాంటాక్ట్‌లను స్నేహితులు, కుటుంబ సభ్యులతో నేరుగా పంచుకునే ఫీచర్‌ను కూడా తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. మెటా బిజినెస్ ఏజెంట్‌ను ఉపయోగించాలనుకునే వ్యాపార సంస్థలు వాట్సాప్ ద్వారా వెయిట్‌లిస్ట్‌లో నమోదు చేసుకోవచ్చు.
ఏఐ బిజినెస్ ఏజెంట్లు కీలకం..
ఈ సందర్భంగా మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, కంట్రీ హెడ్ అరుణ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే సంభాషణల ఆధారిత వ్యాపారాలకు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా మారిందన్నారు. ప్రజలు, వ్యాపార సంస్థలు పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడానికి మెసేజింగ్ ప్రధాన మార్గంగా మారిందని తెలిపారు. వ్యాపారాల పనితీరును మార్చడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో మెటా బిజినెస్ ఏజెంట్ తదుపరి కీలక అడుగుగా నిలుస్తుందని, ఇది కస్టమర్ సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు సామర్థ్యాన్ని పెంచి వ్యాపార వృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ
- ●UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం
- ●Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్
- ●Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!
- ●Tollywood | మైథలాజికల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ కమెడియన్
- ●Fake DSP Arrest Hyderabad | ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌నంటూ బెదిరింపులు.. నకిలీ 'డీఎస్పీ'కి చెక్ పెట్టిన హైదరాబాద్ పోలీసులు

DK Aruna | 15,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలి: డీకే అరుణ

UPI | యూపీఐకి పదేళ్లు.. వృద్ధి ప్రయాణంలో 2026 ఏడాది కీలకం

Payal Shankar | విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన రేవంత్‌కు కనిపిస్తలేదా?: ఎమ్మెల్యే పాయల్ శంకర్

Police Constables Wedding | ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు..! చర్చనీయాంశమైన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల పెళ్లి..!






