Donald Trump | ముందు ఇరాన్ పని ముగిస్తాం.. ఆ తర్వాత క్యూబా పనిపడతాం : ట్రంప్
Donald Trump | ముందు ఇరాన్ (Iran) సంగతి చూస్తామని.. ఆ తర్వాత క్యూబా (Cuba) పని పడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు.
International | Published On Mar 6, 2026, 10.56 am IST
Donald Trump | ఇరాన్ (Iran)పై దాడులు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు తన తర్వాతి టార్గెట్ గురించి కీలక ప్రకటన చేశారు. ముందు ఇరాన్ సంగతి చూస్తామని.. ఆ తర్వాత క్యూబా (Cuba) పని పడతామని వెల్లడించారు. మధ్యప్రాచ్యం (Middle East)లో తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత.. అమెరికా విదేశాంగ విధాన ప్రాధాన్యతల్లో మార్పులు ఉంటాయని వెల్లడించారు.
వైట్‌హౌస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇరాన్‌పైనే తాము పూర్తిగా దృష్టిపెట్టామని స్పష్టం చేశారు. ముందు టెహ్రాన్‌తో వివాదాన్ని ముగించాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత క్యూబా పని పడతామని వెల్లడించారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దళాలు అనుకున్నదానికంటే వేగంగానే ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. తమ దాడుల్లో ఇరాన్ సైనిక సామర్థ్యాలు క్షీణించాయని, నావికాదళాన్ని కూడా పూర్తిగా నాశనం చేశామని వెల్లడించారు. కేవలం మూడు రోజుల్లోనే 30 నౌకలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. తమ దాడులతో ఇరాన్ నేతలు దారికొచ్చారని.. అణు ఒప్పందంపై చర్చలు జరిపేందుకు పలువురు ఇరాన్ నేతలు తమను సంప్రదించినట్లు ట్రంప్ వివరించారు. అయితే, ఇప్పటికే సమయం మించిపోయిందని తాను వారికి చెప్పినట్లు పేర్కొన్నారు.
మరోవైపు తమతో ఒప్పందం చేసుకునేందుకు క్యూబా సైతం ఎదురుచూస్తోందని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. "వాషింగ్టన్‌తో క్యూబా ఒక ఒప్పందం చేసుకోవాలని చాలా బలంగా కోరుకుంటోంది" అని ట్రంప్ అన్నారు. కాగా, కమ్యూనిస్ట్ దేశమైన క్యూబా, అమెరికా మధ్య సంబంధాలు చారిత్రాత్మకంగా ప్రతికూలంగానే ఉన్నాయి. కానీ అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా పెరుగుతున్న అమెరికా-క్యూబా మధ్య ఉద్రిక్తతలు మరింత పెంచేలా చేశాయి.
Also Read..
Israel | ఖమేనీని హతమార్చాలని గత నవంబర్‌లోనే నిర్ణయించుకున్నాం : ఇజ్రాయెల్
Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధం ముగిసేవరకు అంతేనా..?
MacBook Neo | విండోస్ ల్యాప్‌టాప్ లకు పోటీగా యాపిల్ నుంచి చవక మాక్‌బుక్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






