Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధం ముగిసేవరకు అంతేనా..?
Stock Markets | దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం మళ్లీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు కాస్త లాభపడ్డా మళ్లీ ఇవాళ్టి సెషన్‌లో యథావిధిగా నష్టాల బాటలో వెళ్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనం అయి 79,461 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకుంది.
Stock Markets | దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం మళ్లీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం ముగిసిన ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్లు కాస్త లాభపడ్డా మళ్లీ ఇవాళ్టి సెషన్‌లో యథావిధిగా నష్టాల బాటలో వెళ్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనం అయి 79,461 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకుంది. అనంతరం కాస్త రికవర్ అయి 79,600 వద్ద కొనసాగుతోంది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ50 130 పాయింట్లకు పైగా నష్టపోయి 24,588 ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరింది. తరువాత మళ్లీ కాస్త రికవర్ అయి ప్రస్తుతం 24,630 వద్ద కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, ఇండిగో, ఎల్ అండ్ టీ, అల్ట్రా టెక్ సిమెంట్, టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సంస్థలు సెన్సెక్స్‌లో టాప్ లూజర్లుగా నమోదు కాగా హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
నిఫ్టీ ఐటీ సూచీ లాభాల్లో..
సెక్టార్ల వారిగా చూస్తే నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు రంగాలు భారీగా నష్టాల్లో ఉన్నాయి. ఒక్కో సూచీలో 1 శాతం వరకు పతనం సంభవించింది. అయితే నిఫ్టీ ఐటీ సూచీ మాత్రం లాభాల్లో ఉంది. 1.5 శాతం పెరుగుదల నమోదు చేసి టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది.
మార్కెట్లలో నిరంతర అమ్మకాల ఒత్తిడి..
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్రతరం కావడంతో ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. సాధారణంగా మార్కెట్లు భారీగా పతనం అయినప్పుడు కొనుగోలుదారులకు కొన్ని షేర్ల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అందుకనే గురువారం సెషన్ లాభాలతో ముగిసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే యుద్ధం ముగిసిందనే వార్త వచ్చే వరకు మార్కెట్లు ఇలాగే కొనసాగుతాయని వారు అంటున్నారు. నిరంతరం మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి ఉంటుందని, మధ్య మధ్యలో కొనుగోలు దారులు కాస్త ఆసక్తి చూపిస్తే మార్కెట్లు పెరుగుతాయి కానీ యుద్ధం ముగిసేవరకు బుల్ రన్ ర్యాలీ వచ్చే అవకాశం లేదని చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 2 శాతంకు పైగా నష్టపోయింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ 2 శాతం నష్టపోగా, చైనా షాంగై కంపోజిట్ 0.25 శాతం మేర పెరిగింది. జపాన్ నిక్కీ (225) 0.01 శాతం మేర నష్టపోయి ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. గురువారం నాటి సెషన్‌లో యురోపియన్ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. జర్మనీ డాక్స్ 2 శాతం పతనం అవగా, ఫ్రాన్స్ సీఏసీ, యూకే ఎఫ్‌టీఎస్ఈ (100) 1.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఇక అమెరికా మార్కెట్లలో ఎస్ అండ్ పీ (500) 0.56 శాతం మేర నష్టపోగా నాస్‌డాక్ 0.3 శాతం మేర పతనం అయింది.
సంబంధిత వార్తలు

Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
జులై 7, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో సెషన్లోనూ భారీ జోష్.. కొనసాగుతున్న బుల్ ర్యాలీ..
జులై 6, 2026

SEBI | సెబీ కీలక నిర్ణయం.. ఓపెన్ మార్కెట్ షేర్ బైబ్యాక్‌లకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..
జులై 6, 2026
తాజావార్తలు
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ



