Israel | ఖమేనీని హతమార్చాలని గత నవంబర్‌లోనే నిర్ణయించుకున్నాం : ఇజ్రాయెల్
Israel | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) హత్య గురించి ఇజ్రాయెల్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఖమేనీని చంపాలని గతేడాది నవంబర్‌లోనే ప్లాన్ చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) తాజాగా తెలిపారు.
International | Published On Mar 6, 2026, 10.33 am IST
Israel | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) హత్య గురించి ఇజ్రాయెల్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఖమేనీని చంపాలని గతేడాది నవంబర్‌లోనే ప్లాన్ చేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ (Israel Katz) తాజాగా తెలిపారు. ఇందుకోసం ఇరాన్‌పై ఈ ఏడాది మధ్యలో ఆపరేషన్ చేపట్టాలని అనుకున్నామని.. కానీ అక్కడ నెలకొన్న అంతర్గత అస్థిరత కారణంగా అమెరికాతో కలిసి ముందే దాడి చేసినట్లు వివరించారు.
"గతేడాది నవంబర్‌లోనే ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాం. అప్పుడే ఖమేనీని అంతం చేయాలని ప్రధాని నిర్ణయించారు. ఇందుకోసం ఇరాన్‌పై ఈ ఏడాది మధ్యలో ఆపరేషన్ చేపట్టాలని డిసైడ్ అయ్యాం. కానీ, ఇంతలోనే అక్కడ నిరసనలు మొదలయ్యాయి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇరాన్ మత పెద్దలు ఇజ్రాయెల్, మధ్యప్రాచ్యంలోని అమెరికా ఆస్తులపై దాడి చేసే అవకాశం ఉందని భావించాం. అందుకే మా ప్రణాళికను అమెరికాతో పంచుకున్నాం. యూఎస్ సాయంతో ఈ ఏడాది మధ్యలో అనుకున్న ఆపరేషన్‌ను ముందుగానే అమలు చేశాం" అని కాట్జ్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి ముప్పును తొలగించి అక్కడ పాలనలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా కాట్జ్ పేర్కొన్నారు. గత శనివారం ఇజ్రాయెల్-అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.
Also Read..
Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. యుద్ధం ముగిసేవరకు అంతేనా..?
Sukhoi Fighter Jet | కుప్పకూలిన సుఖోయ్ ఫైటర్ జెట్.. ఇద్దరు పైలట్లు మృతి
MacBook Neo | విండోస్ ల్యాప్‌టాప్ లకు పోటీగా యాపిల్ నుంచి చవక మాక్‌బుక్
సంబంధిత వార్తలు

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త ‘సుప్రీం లీడర్’ దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
జులై 5, 2026

Ali Khamenei Funeral | ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియల్లో అందరి దృష్టి ఆ చిన్న శవపేటికపైనే.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు!
జులై 4, 2026

Ayatollah Ali Khamenei | అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు.. టెహ్రాన్‌కు భౌతికకాయం..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
- ●Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల
- ●Strong surface winds | జూలై 11 వరకు బలమైన గాలులు.. బీ కేర్‌ఫుల్..!
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..

Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల



