MacBook Neo | విండోస్ ల్యాప్‌టాప్ లకు పోటీగా యాపిల్ నుంచి చవక మాక్‌బుక్
MacBook Neo | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ విండోస్ ల్యాప్‌టాప్‌లకు పోటీగా అత్యంత చవక ధరకే కొత్త మాక్‌బుక్‌ను లాంచ్ చేసింది. మాక్‌బుక్ నియో పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. మాక్‌బుక్‌లలో ఇది ఎంట్రీ లెవల్ డివైస్ కావడం విశేషం. ఇది 13 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంది. యాపిల్ ఎ18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Technology | Published On Mar 6, 2026, 9.42 am IST
MacBook Neo | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ విండోస్ ల్యాప్‌టాప్‌లకు పోటీగా అత్యంత చవక ధరకే కొత్త మాక్‌బుక్‌ను లాంచ్ చేసింది. మాక్‌బుక్ నియో పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టింది. మాక్‌బుక్‌లలో ఇది ఎంట్రీ లెవల్ డివైస్ కావడం విశేషం. ఇది 13 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంది. యాపిల్ ఎ18 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మాక్‌బుక్ కేవలం 1.23 కిలోల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అందువల్ల యూజర్లు తమ రోజువారి అవసరాలకు దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికంటే అక్కడికి ఈజీగా తీసుకెళ్లవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌లో 13 ఇంచుల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను ఇవ్వగా దీనికి 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లభిస్తుంది. అందువల్ల ఔట్‌డోర్‌లోనూ డిస్‌ప్లేను వీక్షించడం సులభతరం అవుతుంది.
సాధారణ విండోస్ ల్యాప్‌టాప్ కన్నా వేగంగా..
మాక్‌బుక్ నియో ల్యాప్ టాప్‌లో యాపిల్‌కు చెందిన ఎ18 ప్రొ ప్రాసెసర్ ఉన్నందున వెబ్ బ్రౌజింగ్ వంటి పనులను 50 శాతం వేగంతో నిర్వహించుకోవచ్చు. సాధారణ విండోస్ ల్యాప్‌టాప్ కన్నా 3 రెట్లు వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలిపింది. ముఖ్యంగా ఫొటో ఎడిటింగ్ పనులను విండోస్ ల్యాప్ టాప్ కన్నా రెండు రెట్ల వేగంతో నిర్వహించుకోవచ్చని తెలియజేసింది. ఈ మాక్‌బుక్‌లో ఇంటిగ్రేటెడ్ 5-కోర్ జీపీయూను గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ కోసం ఇచ్చారు. 16-కోర్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ కూడా లభిస్తుంది. ఈ మాక్‌బుక్‌ను ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 16 గంటల వరకు వాడుకోవచ్చని యాపిల్ తెలిపింది.
టచ్ ఐడీ, డాల్బీ అట్మోస్, రెండు స్టోరేజ్ ఆప్షన్లు..
ఈ మాక్‌బుక్‌లో యాపిల్‌కు చెందిన స్టాండర్డ్ మ్యాజిక్ కీబోర్డును ఇచ్చారు. మల్టీ టచ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఉంది. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం టచ్ ఐడీని ఇచ్చారు. ముందు వైపు 1080పి హెచ్‌డీ కెమెరా ఉంది. డ్యుయల్ మైక్రోఫోన్‌లను ఇచ్చారు. డ్యుయల్ సైడ్ ఫైరింగ్ స్పీకర్లు ఉండగా, వీటికి స్పేషియల్ ఆడియో, డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌కు 2 యూఎస్‌బీ టైప్ సి పోర్టులు, ఒక 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, వైఫై 6ఇ, బ్లూటూత్ 6.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. 8జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో దీన్ని లాంచ్ చేశారు. మాక్ ఓఎస్ డిఫాల్ట్‌గా లభిస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌తోపాటు 20వాట్ల యూఎస్‌బీ టైప్ సి పవర్ అడాప్టర్ లభిస్తుంది.
ధర వివరాలు..
యాపిల్ మాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌ను సిల్వర్, బ్లష్, సిట్రస్, ఇండిగో కలర్ ఆప్షన్ లలో లాంచ్ చేయగా ఈ ల్యాప్‌టాప్‌కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.69,900గా ఉంది. అలాగే 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.79,900గా నిర్ణయించారు. వినియోగదారులు యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ మాక్‌బుక్‌ను ప్రస్తుతం ఆర్డర్ చేయవచ్చు. భారత్ సహా 30కి పైగా దేశాల్లో ఈ ల్యాప్ టాప్ అందుబాటులో ఉంది. యాపిల్ స్టోర్ లొకేషన్లు, యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్ల వద్ద ఈ మాక్‌బుక్ మార్చి 11 నుంచి లభ్యం కానుంది.
తాజావార్తలు
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ






