BSP | ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు.. యూపీలో బీఎస్పీకి ఎదురుదెబ్బ
BSP | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి (Mayawati ) భారీ ఎదురుదెబ్బ తగలింది. ఆమె నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP)కి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు. దీంతో యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం బీఎస్పీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది.
BSP | త్రినేత్ర.న్యూస్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి (Mayawati ) భారీ ఎదురుదెబ్బ తగలింది. ఆమె నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (BSP)కి ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కన్నుమూశారు. దీంతో యూపీ అసెంబ్లీలో ప్రస్తుతం బీఎస్పీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. రస్రా ఎమ్మెల్యే (Rasra MLA) ఉమాశంకర్ సింగ్ (Umashankar Singh) బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో (Brain Tumour) బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటే దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఉమాశంకర్ మృతిపట్ల ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ఎంతో బాధాకరమని, ఉమాశంకర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఉమాశంకర్ మరణం తీవ్రంగా బాధించిందని, పార్టీకి ఆయన చేసిన సేవలు, విధేయత ఎప్పటికీ గుర్తుండిపోతాయని మాయావతి అన్నారు. నిజాయితీగల, అంకితభావంతో పనిచేసిన పార్టీ నేత, బీఎస్పీ పట్ల ఆయన చూపిన నిబద్ధత ఎంత ప్రశంసించిన తక్కువేనని చెప్పారు.
విద్యార్థి నాయకుడిగా..
విద్యార్థినాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉమాశంకర్.. 1990-91లో బల్లియాలోని సతీశ్ చంద్ర కాలేజీ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం క్రియాశీలక రాజకీయాల్లో వచ్చిన ఆయన 2012 ఎన్నికల్లో తొలిసారిగా రస్రా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2017, 2022లో జరిగిన ఎన్నికల్లోనూ వరుసగా అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తతం యూపీ అసెంబ్లీలో బీఎస్పీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడం గమనార్హం.
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ





