Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.28వేలు పెరిగిన పసిడి ధర.. మళ్లీ రెక్కలు..
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతుండడంతోపాటు అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు మళ్లీ ప్రారంభం కావడంతో ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహం వచ్చింది. వరుస సెషన్లలో స్వల్ప లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల జోరు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Gold And Silver Prices Today | మధ్య ప్రాచ్యంలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతుండడంతోపాటు అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు మళ్లీ ప్రారంభం కావడంతో ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహం వచ్చింది. వరుస సెషన్లలో స్వల్ప లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల జోరు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్లే ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర అస్థిరతతో ఉన్నాయని అంటున్నారు. ఇక దీని ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లలో బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గురువారం సెషన్‌లో ఔన్స్ బంగారం ధర 0.16 శాతం మేర పెరిగి 4,253 డాలర్లకు చేరగా, వెండి ధర 0.18 శాతం తగ్గి 61 డాలర్లకు వచ్చింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 832 పాయింట్లకు పైగా పెరిగి 1,49,254 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 272 పాయింట్లు తగ్గి 2,27,350 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరగ్గా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,973 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,19, 784గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,49,730 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,97,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.28,900 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,725 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,09,800గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,37,250 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,72,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.26,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,230 ఉండగా, 8 గ్రాముల ధర రూ.89,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,12,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,23,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.21,700 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,40,000 ఉండగా, తులం ధర రూ.2,400గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
సెప్టెంబర్ 22, 2026

Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. కొనేందుకు చాన్స్..?
సెప్టెంబర్ 22, 2026

Gold Sales | పుత్తడి ధరలు తగ్గినా ఆచితూచి కొనుగోళ్లు.. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌పై ఆశలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ
- ●Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
- ●CM Revanth Reddy | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు : సీఎం రేవంత్‌రెడ్డి

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..

Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ

Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ



