త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Quad Summit | మోదీ చాలా ట‌ఫ్ గాయ్‌.. ప్ర‌ధానిపై ట్రంప్ ప్ర‌శంస‌లు

Quad Summit | మనీలాలో (Manila) జ‌రిగిన 'క్వాడ్' (Quad) శిఖరాగ్ర సమావేశంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌శంస‌లు కురిపించారు. మోదీ చాలా ట‌ఫ్ గాయ్ (Tough Guy) అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు.

D

International | Published On Nov 17, 2026, 5.17 pm IST

Quad Summit | మోదీ చాలా ట‌ఫ్ గాయ్‌.. ప్ర‌ధానిపై ట్రంప్ ప్ర‌శంస‌లు
Advertisement

Quad Summit | త్రినేత్ర న్యూస్ : ఫిలిప్పీన్స్ (Philippines) వేదిక‌గా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాధినేతల 'క్వాడ్' (Quad) శిఖరాగ్ర సమావేశం జరిగింది. రాజధాని మనీలాలో (Manila) జ‌రిగిన ఈ స‌మావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని సనే తకైచి పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా జరిగిన ఫోటో సెషన్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ఫొటో కోసం అందరూ నిలబడిన సమయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. ప‌క్క‌న నిల్చున్నారే ఈయ‌న (ప్ర‌ధాని మోదీ వైపు చూపుతూ) చాలా టఫ్ గాయ్ (Tough Guy) అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. మోదీ గొప్ప నాయ‌కుడ‌ని కొనియాడారు.

అదేవిధంగా రేర్ ఎర్త్స్ విషయంలో కూటమి స‌హ‌కారాన్ని ట్రంప్ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, సముద్ర సహకారం, ముఖ్యంగా అరుదైన ఖనిజాల (Rare Earths) సరఫరా గొలుసు విషయంలో నాలుగు దేశాల మధ్య పెరుగుతున్న సహకారాన్ని ట్రంప్ ప్రత్యేకంగా అభినందించారు. ప్ర‌పంచంలోని అత్యంత విజ‌య‌వంత‌మైన భాగ‌స్వామ్యాల‌ను క్వాడ్ ఒక చోట చేర్చింద‌ని పేర్కొన్నారు. “మాకు కావాల్సిన ఖ‌నిజ నిల్వ‌లు మరో 10 నెలల్లో అందుబాటులోకి వస్తాయి. రేర్ ఎర్త్స్ ఉత్పత్తిలో మేం భారీ సంఖ్యలో వృద్ధి సాధిస్తున్నాం. కేవలం అమెరికా మాత్రమే కాకుండా భారత్, జపాన్ కూడా రేర్ ఎర్త్స్ ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో వేగంగా అడుగులు వేస్తూ కలిసికట్టుగా పనిచేస్తున్నాయి” అని ట్రంప్ ప్ర‌శంసించారు. కేవలం 10 నెలల్లోనే అమెరికాకు కావాల్సిన అవసరాలన్నీ తీరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

దాదాపు రెండేళ్ల త‌ర్వాత క్వాడ్ దేశాధినేతలు స‌మావేశ‌మ‌య్యారు. చివ‌రిసారిగా క్వాడ్ అధినేత‌ల స‌మావేశం 2024 సెప్టెంబ‌ర్ 21న డెలావేర్ వేదిక‌గా అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక, సనే తకైచి జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక జరిగిన‌ తొలి క్వాడ్ అధినేతల సదస్సు ఇదే. అంతేకాదు, సాధారణంగా క్వాడ్ సభ్యదేశాల్లోనే ఈ సదస్సు జరుగుతుండగా మొట్ట‌మొద‌టిసారి నాన్-క్వాడ్ దేశమైన ఫిలిప్పీన్స్‌లో ఈ స‌మావేశం జరగ‌డం విశేషం.

Also Read..

కులం, మ‌తం ఆధారంగా ఓటర్ల రికార్డులను నిర్వహించం.. సీఎం యోగి ఆరోప‌ణ‌ల‌పై స్ప‌ష్ట‌త‌నిచ్చిన ఎన్నిక‌ల అధికారి

మాజీ మంత్రి బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - సీనియ‌ర్ హీరోయిన్ల సంద‌డిడి

దలాల్ స్ట్రీట్‌లో జోరు.. 427 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Advertisement
Advertisement