త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో జోరు.. 427 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాటలో పయనించాయి. మంగళవారం సెన్సెక్స్ 427 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 25,350 మార్కును దాటి ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ప్రధానంగా మద్దతునిచ్చాయి. అయితే ఐటీ, కన్స్యూమర్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి లాభాలను కొంతమేర పరిమితం చేసింది.

S

Business | Published On Nov 17, 2026, 4.37 pm IST

Stock Markets | దలాల్ స్ట్రీట్‌లో జోరు.. 427 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాల బాటలో పయనించాయి. మంగళవారం సెన్సెక్స్ 427 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 25,350 మార్కును దాటి ముగిసింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు ప్రధానంగా మద్దతునిచ్చాయి. అయితే ఐటీ, కన్స్యూమర్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి లాభాలను కొంతమేర పరిమితం చేసింది.

లాభాల్లో ముగిసిన సూచీలు..

బీఎస్ఈ సెన్సెక్స్ 427.40 పాయింట్లు (0.52 శాతం) పెరిగి 82,532.19 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 96.30 పాయింట్లు (0.38 శాతం) లాభపడి 25,387.40 వద్ద ముగిసింది. నిఫ్టీ ఉదయం 25,277.30 వద్ద ప్రారంభమై, ఇంట్రాడేలో గరిష్ఠంగా 25,501.35 పాయింట్లను, కనిష్ఠంగా 25,267.30 పాయింట్లను తాకింది. వ్యక్తిగత షేర్లలో యాక్సిస్ బ్యాంక్ అత్యధికంగా 2.06 శాతం లాభపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.01 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.74 శాతం, టీసీఎస్ 1.67 శాతం, అదానీ పోర్ట్స్ 1.56 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.95 శాతం నష్టపోయి టాప్ లూజర్‌గా నిలిచింది. పవర్ గ్రిడ్ 1.53 శాతం, టెక్ మహీంద్రా 1.43 శాతం, ఇన్ఫోసిస్ 1.20 శాతం, ట్రెంట్ 0.59 శాతం చొప్పున తగ్గాయి.

బ్యాంకింగ్ షేర్ల‌లో కొనుగోళ్లు..

రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలిచాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 1.95 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ 1.13 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.89 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ రంగంలోనూ కొనుగోళ్ల జోరు కనిపించడంతో నిఫ్టీ రియాల్టీ 1.94 శాతం లాభపడింది. నిఫ్టీ ఆటో 0.72 శాతం, నిఫ్టీ మీడియా 0.64 శాతం, నిఫ్టీ మెటల్ 0.58 శాతం చొప్పున పెరిగాయి. అయితే ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టీ ఐటీ 0.90 శాతం నష్టపోయి అత్యంత బలహీనమైన రంగాల సూచీగా నిలిచింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.20 శాతం, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.24 శాతం తగ్గాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.25 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.22 శాతం నష్టపోయింది. నిఫ్టీ 500 సూచీ 0.29 శాతం లాభపడింది. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ 1.10 శాతం తగ్గి 15.51కు చేరింది.

అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్న పెట్టుబ‌డిదారులు..

ఎన్‌రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ మాట్లాడుతూ, పలు రంగాల్లో కొనుగోళ్లు జరగడం మార్కెట్‌లో విస్తృత భాగస్వామ్యాన్ని సూచిస్తోందని తెలిపారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ షేర్లు లాభాలకు నాయకత్వం వహించాయని, ఐటీ రంగం మాత్రం దాదాపు ఒక శాతం నష్టంతో బలహీనంగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ షేర్లలో బలహీనత కారణంగా ఐటీ రంగంపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. రానున్న రోజుల్లో ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ, విదేశీ పెట్టుబడుల ప్రవాహాలు మార్కెట్ గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని తెలిపారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయని, కృత్రిమ మేధ, సెమీకండక్టర్ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఐటీ షేర్ల విషయంలో రంగాల వారీగా అప్రమత్తత అవసరమని సూచించారు.

Advertisement
Advertisement