US Strikes | మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ స్థావరాలపై అమెరికా ఆత్మరక్షణ దాడులు
US Strikes | దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం మరోసారి భగ్గుమంది. ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడింది (US Strikes). రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై దాడులు చేసింది.
International | Published On Jun 1, 2026, 11.09 am IST
US Strikes | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. తాజాగా దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం మరోసారి భగ్గుమంది. సంక్షోభానికి ముగింపు పలికేందుకు దోహా వేదికగా కీలక చర్చలు జరుగుతుండగానే.. ఇరాన్-అమెరికా మాత్రం భీకర దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై అమెరికా విరుచుకుపడింది (US Strikes). రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఇరాన్‌లోని గోరుక్, కేష్మ్ ద్వీపాల్లోని స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినట్లు తెలిపింది.
తమ MQ-1 డ్రోన్‌ను కూల్చివేసిన నేపథ్యంలో ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెట్రల్ కమాండ్ వెల్లడించింది. "ఇరాన్‌లోని గోరుక్, కేష్మ్ ద్వీపం (Qeshm Island)లో ఉన్న ఇరాన్ రాడార్, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై యుఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఆత్మరక్షణ దాడులను నిర్వహించింది" అని పేర్కొంది. అమెరికా డ్రోన్‌ను కూల్చివేసినందుకు ప్రతిచర్యగానే ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు.. ఇరాన్ భూభాగంపై దాడులు చేసేందుకు అమెరికా ఉపయోగించిన సైనిక స్థావరాన్ని తాము లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వెల్లడించింది. అయితే, ఆ సైనిక స్థావరం ఎక్కడ ఉందనే విషయాన్ని మాత్రం ఐఆర్‌జీసీ వెల్లడించలేదు.
Also Read..
సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. వీడియో
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
- ●22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !
- ●CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!
- ●CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్
- ●CM Revanth Reddy | ప్రజాపాలనలో వైద్యానికి ప్రాధాన్యం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●BUS and Lorry Accident | కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ఐదుగురి పరిస్థితి విషమం

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

22A చిక్కుముడి: అసలేంటీ నిషేధిత భూముల రగడ? బాధితులు ఇదిగో ఇలా చేయండి !

CM Revanth Reddy | ఎర్రగడ్డకు వెళ్లి టిమ్స్ కట్టానని చెప్పాడట!. కేటీఆర్‌పై రేవంత్ సెటైర్లు..!

CM Revanth Reddy | పేదల కోసం రేవంత్ అన్న ఉన్నడని భరోసా కల్పించాలి : సీఎం రేవంత్






